/rtv/media/media_files/2025/01/16/oPIH1C85PT7wWpRkmji4.jpg)
ind vs pak Champions Trophy Photograph: (ind vs pak Champions Trophy)
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనుంది. దీనికి సంబంధించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) స్వదేశంలో జరిగే అన్ని మ్యాచ్‌ల టిక్కెట్ల ధరలను విడుదల చేసింది. ఇందులో టికెట్ రూ.1000గా ఫిక్స్ చేసింది. అంటే ఇది భారత్ లో రూ. 310లతో సమానం అన్నమాట. ఇది నిజంగా అభిమానులకు శుభవార్తే అని చెప్పాలి. ఇవే భారత్ లో అయితే రూ. 2 వేలకు పైగానే ఉంటాయి.
పాకిస్తాన్ బోర్డు తన హోమ్ మ్యాచ్‌ల టిక్కెట్ల ధరలను మాత్రమే విడుదల చేసింది. అంటే కరాచీ, లాహోర్, రావల్పిండిలో జరుగుతున్న మ్యాచ్‌ల టిక్కెట్ల ధరలను మాత్రమే విడుదల చేసిందన్నమాట. భారత జట్టు తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడాల్సి ఉంది. ఇక్కడ సెమీ ఫైనల్ మ్యాచ్ కూడా ఉంటుంది. ఈ మ్యాచ్‌ల టికెట్ ధరలు ఇంకా ఫిక్స్ చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ల ధర ఎంత ఉంటుందో అన్నది ఆసక్తిగా మారింది. అయితే పాకిస్థాన్-బంగ్లాదేశ్ మ్యాచ్‌కు టిక్కెట్ ధర రూ. 2000 (భారత్ లో రూ. 620) గా ఫిక్స్ అయింది. ఈ మ్యాచ్ పాకిస్తాన్ లోని రావల్పిండిలో జరగనుంది.
పాకిస్థాన్‌లో జరిగే మ్యాచ్‌ల టిక్కెట్ల ధరలు ఇలా..
పాకిస్థాన్‌లోని అన్ని మ్యాచ్‌లు కరాచీ, లాహోర్ మరియు రావల్పిండిలోని 3 స్టేడియంలలో జరుగుతాయి. వీటి ధర రూ. 1000 (ఇండియాలో రూ. 310తో సమానం)
రావల్పిండిలో జరగనున్న పాకిస్థాన్-బంగ్లాదేశ్ మ్యాచ్‌కు చౌకైన టిక్కెట్ ధర రూ. 2000 (ఇండియాలో రూ. 620తో సమానం)
పాకిస్తాన్‌లో ఒకే ఒక సెమీ-ఫైనల్ మ్యాచ్ ఉంటుంది, దీని టిక్కెట్ ధర రూ. 2500 (ఇండియాలో రూ. 776తో సమానం)
VVIP టిక్కెట్ ధర రూ.12 వేలు (ఇండియాలో రూ. 3726 తో సమానం)
సెమీ-ఫైనల్‌లో VVIP టికెట్ ధర రూ. 25000 (ఇండియాలో రూ. 7764తో సమానం)
ప్రీమియర్ గ్యాలరీ టిక్కెట్ ధరలు స్టేడియంలలో మారుతూ ఉంటాయి. కరాచీలోని ప్రీమియర్ గ్యాలరీ టిక్కెట్ ధర రూ. 3500(ఇండియాలో రూ. 1086తో సమానం)
లాహోర్‌లో, పాకిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ టిక్కెట్ రూ. 5000 (ఇండియాలో రూ. 1550 తో సమానం).
రావల్పిండిలో, పాకిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్‌కు టిక్కెట్టు రూ.7000 పాకిస్తాన్ రూపాయలు (ఇండియాలో రూ. 2170 తో సమానం.
వీఐపీ టిక్కెట్ల ధర కూడా మారనుంది. ఇది కరాచీలో రూ. 7000 (ఇండియాలో రూ. 2,171తో సమానం). లాహోర్‌లో రూ. 7,500 (ఇండియాలో 2,326 తో సమానం), బంగ్లాదేశ్ మ్యాచ్‌కు రూ.12,500 (ఇండియాలో3,877తో సమానం) అవుతుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పూర్తి షెడ్యూల్
19 ఫిబ్రవరి - పాకిస్తాన్ vs న్యూజిలాండ్, కరాచీ
20 ఫిబ్రవరి - బంగ్లాదేశ్ vs ఇండియా, దుబాయ్
21 ఫిబ్రవరి - ఆఫ్ఘనిస్తాన్ vs దక్షిణాఫ్రికా, కరాచీ
ఫిబ్రవరి 22 - ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్, లాహోర్
23 ఫిబ్రవరి - పాకిస్తాన్ వర్సెస్ ఇండియా, దుబాయ్
24 ఫిబ్రవరి - బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్, రావల్పిండి
ఫిబ్రవరి 25 - ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా, రావల్పిండి
ఫిబ్రవరి 26 - ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్, లాహోర్
ఫిబ్రవరి 27 - పాకిస్తాన్ vs బంగ్లాదేశ్, రావల్పిండి
ఫిబ్రవరి 28 - ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా, లాహోర్
1 మార్చి – దక్షిణాఫ్రికా vs ఇంగ్లండ్, కరాచీ
2 మార్చి – న్యూజిలాండ్ vs ఇండియా, దుబాయ్
4 మార్చి – సెమీఫైనల్-1, దుబాయ్
5 మార్చి – సెమీఫైనల్-2, లాహోర్
మార్చి 9 – ఫైనల్, లాహోర్
మార్చి 10- రిజర్వ్ డే
Also Read : Maha Kumbh: కుంభమేళా ఎఫెక్ట్.. విమాన టికెట్ ధరలు చుక్కల్లోనే