BCCI: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) 93వ వార్షిక సర్వసభ్య సమావేశం 2024 సెప్టెంబర్ 29వ తేదీన బెంగళూరులో జరిగింది. ఈ సమావేశంలో బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత క్రికెటర్ల సంఘం (ICA) ప్రతినిధిగా వి.చాముండేశ్వరనాథ్‌ను నామినేట్ చేసింది. దీంతో ఆయనకు ఐపీఎల్ పాలకమండలిలో స్థానం లభించింది. తెలుగు క్రికెటర్, టీమిండియా మాజీ మేనేజర్ అయిన చాముండేశ్వరనాథ్ గతంలో కూడా ఐపీఎల్‌లో ఆటగాళ్ల సంఘం ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు.
అలాగే అరుణ్ సింగ్ ధమాల్, అవిషేక్ దాల్మియా కూడా ఐపీఎల్ పాలకమండలికి ఎన్నికయ్యారు. ఈ వివరాలను బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. 2024-25 సీజన్‌కు బీసీసీఐ వార్షిక బడ్జెట్‌కు ఈ సర్వసభ్య సమావేశంలో ఆమోదం లభించినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఆటగాళ్ల వేలం సైకిల్ 2025-2027కి సంబంధించి IPL గవర్నింగ్ కౌన్సిల్ సిఫార్సులు ఆమోదించబడ్డాయి. ఇందులో ప్లేయర్ రిటెన్షన్స్, రైట్ టు మ్యాచ్, శాలరీ క్యాప్ మొదలైనవి ఉన్నాయి. కొత్త నేషనల్ క్రికెట్ అకాడమీ క్యాంపస్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు సంబంధించి చేపట్టిన పనులకు ఆఫీస్ బేరర్లు చేస్తున్న కృషిని జనరల్ బాడీ సభ్యులు అభినందించారు. BCCI చట్టపరమైన హోదాను కొనసాగించాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. IPLతో సహా BCCI టోర్నమెంట్‌లను వేరువేరుగా చూడకూడదని నిర్ణయించినట్లు జై షా తెలిపారు.
Also Read : తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌తో డైరెక్ట్ రిజల్ట్స్!