Mahmudullah: 39 ఏళ్ల మహ్మదుల్లా క్రికెట్‌కు రిటైర్మెంట్ !

బంగ్లాదేశ్ క్రికెటర్ మహ్మదుల్లా కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ ప్రకటన చేశాడు. తనకు మద్దతు ఇచ్చిన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపాడు.

New Update
Mahmudullah

బంగ్లాదేశ్ క్రికెటర్ మహ్మదుల్లా కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ ప్రకటన చేశాడు. తనకు మద్దతు ఇచ్చిన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపాడు. 39 ఏళ్ల మహ్మదుల్లా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు.  2007లో శ్రీలంకపై తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన మహ్మదుల్లా .. 2021లో టెస్టులు, 2024లో టీ20లకు గుడ్ బై చెప్పాడు.  ఇప్పుడు వన్డేల నుంచి తప్పుకున్నట్లుగా తెలిపాడు.  

నాల్గవ ఆటగాడిగా మహ్మదుల్లా

బంగ్లా తరఫున మహ్మదుల్లా 50 టెస్టులు, 239 వన్డేలు, 141 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 11 వేల 47 పరుగులు చేశాడు.  బంగ్లాదేశ్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన నాల్గవ ఆటగాడిగా మహ్మదుల్లా నిలిచాడు. ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, తమీమ్ ఇక్బాల్ తర్వాత మహ్మదుల్లా  36.46 సగటుతో 5689 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు ఉన్నాయి.  మహ్మదుల్లా సెంచరీలన్నీ ఐసీసీ టోర్నమెంట్లలోనే చేశాడు. 

2015 వన్డే ప్రపంచ కప్‌లో రెండు సెంచరీలు చేసిన  మహ్మదుల్లా 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో కార్డిఫ్‌లో న్యూజిలాండ్‌పై 102 పరుగులు చేశాడు. 2023 వన్డే ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికాపై 111 పరుగులు చేశాడు . 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రావల్పిండిలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మదుల్లా కేవలం ఒక ఇన్నింగ్స్ మాత్రమే ఆడి 14 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేశాడు . కాగా మహ్మదుల్లాతో పాటు, తమీమ్ ఈ సంవత్సరం ప్రారంభంలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 

Also read :  బిగ్ షాక్‌ ..హైదరాబాద్లో రేపు వైన్ షాపులు బంద్ !

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు