BAN vs PAK : ఛీ.. ఛీ పరువు పోయిందిగా.. పసికూన చేతిలో పాకిస్థాన్‌కు ఘోర అవమానం!

పాకిస్థాన్‌కు మరో ఘోర పరాజయం జరిగింది. ఉమెన్స్ వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ జట్టుకు బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. పాక్ ను చిత్తుచిత్తుగా ఓడించింది. పాక్ పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

New Update
pak vs ban

పాకిస్థాన్‌కు మరో ఘోర పరాజయం జరిగింది. ఉమెన్స్ వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ జట్టుకు బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. పాక్ ను చిత్తుచిత్తుగా ఓడించింది. పాక్ పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ బౌలర్ల ముందు నిలబడలేకపోయింది.

38.3 ఓవర్లలో కేవలం 129 పరుగులకే ఆలౌట్ అయింది. రమీన్ షమీమ్ 39 బంతుల్లో 23 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా, ఫాతిమా సనా 33 బంతుల్లో 22 పరుగులు  చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో షోర్నా అక్తర్ 3/5 తో అద్భుతంగా రాణించింది. యువ పేసర్ మరుఫా అక్తర్, నహీదా అక్తర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

వన్డే అరంగేట్రంలోనే అజేయంగా

ఇక 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో, బంగ్లాదేశ్ ఓపెనర్ రుబ్య హైదర్ తన వన్డే అరంగేట్రంలోనే అజేయంగా 54 పరుగులు (77 బంతుల్లో 8 ఫోర్లు) చేసి విజయంలో కీలక పాత్ర పోషించింది. రుబ్య హైదర్, కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీ (23) తో కలిసి 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. చివరికి శోభనా మోస్తరీ (24 నాటౌట్) సహాయంతో బంగ్లాదేశ్ 31.1 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. బంగ్లాదేశ్ పేసర్ మారుఫా అక్తర్ (2 వికెట్లు) అద్భుతమైన బౌలింగ్‌కుగాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకుంది.

కాగా ఇటీవల పురుషుల ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ చేతిలో పాక్ ఓడిన సంగతి తెలిసిందే. దీంతో ఆ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగులుతోందంటూ క్రికెట్ ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇక ఇది బంగ్లాదేశ్ మహిళా క్రికెట్‌లో వన్డే అరంగేట్రంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు కావడం విశేషం. అంతేకాక, ఇది మహిళల ప్రపంచకప్‌లో (Women's World Cup) రన్ ఛేజింగ్‌లో బంగ్లాదేశ్‌కు నమోదైన మొదటి 50+ స్కోరు కూడా.. 

Advertisment
తాజా కథనాలు