/rtv/media/media_files/2026/03/08/kivis-2026-03-08-21-36-07.jpg)
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ ఉత్కంఠభరిత ఫైనల్‌లో 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు కట్టడి చేస్తున్నారు. టీమ్ ఇండియా నిర్దేశించిన కొండంత లక్ష్యం ముందు కివీస్ తడబడుతోంది. కేవలం 48 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్, ఇప్పుడు మూడో వికెట్ కూడా కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
మొదటగా డేంజరస్ బ్యాటర్ ఫిన్ అలెన్ ఔట్ అయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో బౌండరీ లైన్ వద్ద తిలక్ క్యాచ్ పట్టడంతో అలెన్ పెవిలియన్‌కు చేరాడు. రచిన్ రవీంద్రను జస్ప్రీత్ బుమ్రా తన పదునైన బౌలింగ్‌తో అవుట్ చేసి భారత్‌కు శుభారంభం అందించాడు. ఆ వెంటనే స్పిన్ మాంత్రికుడు అక్షర్ పటేల్ తన జోరును ప్రదర్శించాడు. కివీస్ మిడిలార్డర్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్‌ను అక్షర్ క్లీన్ బౌల్డ్ చేయడంతో న్యూజిలాండ్ మూడో వికెట్‌ను కూడా కోల్పోయింది. అక్షర్ పటేల్ ఇప్పటివరకు రెండు వికెట్లు తీసి కివీస్ పతనాన్ని శాసిస్తున్నాడు.
భారత బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ బ్యాటర్లు పరుగులు తీయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. బుమ్రా వేగం, అక్షర్ చాకచక్యం భారత్‌ను మరో ప్రపంచ కప్ దిశగా నడిపిస్తున్నాయి.
Follow Us