BIG BREAKING  :  WTC ఫైనల్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం 15 మందితో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. పాట్ కమ్మిన్స్ నేతృత్వంలో టీమ్ జూన్ లో 11వ తేదీ నుంచి 15 వరకు దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్ట్‌లో తలపడనుంది.

New Update
wtc-final

wtc-final

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం 15 మందితో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. పాట్ కమ్మిన్స్ నేతృత్వంలో టీమ్ జూన్ లో 11వ తేదీ నుంచి 15 వరకు దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్ట్‌లో తలపడనుంది. లార్ట్స్ వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.  పాట్ కమ్మిన్స్, జోష్ హాజిల్‌వుడ్‌లతో పాటు, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ స్టార్క్ కూడా టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు జట్టులో ఉన్నారు. మెరాన్ గ్రీన్ టెస్ట్ జట్టులోకి తిరిగి రావడం ఆస్ట్రేలియాకు బిగ్ ప్లస్ అని చెప్పాలి.  

దక్షిణాఫ్రికాకు ఇదే తొలిసారి

ఐపీఎల్‌లో గాయం కారణంగా ఆర్‌సిబి తరపున చివరి రెండు ఆటలకు దూరమైన పేసర్ జోష్ హేజిల్‌వుడ్ జట్టులోకి తిరిగి వచ్చాడు.  భారత్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన ఆల్ రౌండర్ బ్యూ వెబ్‌స్టర్ కూడా జట్టులో తన స్థానాన్ని నిలుపుకున్నాడు. WTC ఫైనల్ తర్వాత వెస్టిండీస్‌తో జరిగే మూడు టెస్టుల్లో కూడా ఇదే జట్టు ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహిస్తుంది. దక్షిణాఫ్రికా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.  కాగా దక్షిణాఫ్రికా 12 టెస్టుల్లో ఎనిమిది విజయాలతో 69.44 పాయింట్ల శాతంతో అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా 19 మ్యాచ్‌ల్లో 13 విజయాలతో 67.54 పాయింట్లతో ఉంది. 

WTC ఫైనల్‌కు ఆస్ట్రేలియా జట్టు: 

పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లాబుస్చాగ్నే, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్. ట్రావెలింగ్ రిజర్వ్: బ్రెండన్ డాగెట్.

Advertisment
Advertisment
తాజా కథనాలు