IND Vs PAK: భారత్-పాకిస్తాన్ మధ్య మళ్లీ మ్యాచ్.. ఈ నెలలోనే మరో ఆసియా కప్

భారత్, పాకిస్తాన్ జట్లు 2025 ఆసియా కప్ టోర్నీలో మూడు సార్లు పోటీ పడగా.. టీమిండియా మూడు సందర్భాల్లోనూ పాకిస్తాన్‌ను ఓడించింది. ఆసియా కప్ తర్వాత అభిమానులు మరోసారి భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ను చూసేందుకు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

New Update
Asia Cup Rising Stars T20 Tournament

Asia Cup Rising Stars T20 Tournament

భారత్, పాకిస్తాన్ జట్లు చివరిసారిగా 2025 ఆసియా కప్ టోర్నీలో తలపడ్డాయి. ఈ రెండు జట్లు దాదాపు మూడు సార్లు పోటీ పడగా.. టీమిండియా మూడు సందర్భాల్లోనూ పాకిస్తాన్‌ను ఓడించింది. ఆసియా కప్ తర్వాత అభిమానులు మరోసారి భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ను చూసేందుకు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికోసం అదిరిపోయే సర్‌ప్రైజ్ బయటకొచ్చింది. ఆసియా కప్ తర్వాత IND VS PAK జట్లు మరోసారి తలపడబోతున్నాయి. 

Asia Cup Rising Stars T20 Tournament

 నవంబర్ 14 నుంచి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఆధ్వర్యంలో ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ T20 టోర్నమెంట్‌ (Asia Cup Rising Stars) ప్రారంభం కానుంది. ఖతార్‌లోని దోహా వేదికగా ఇది నవంబర్ 23 వరకు కొనసాగనుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. అందులో భారతదేశం, పాకిస్తాన్, ఒమన్, UAE, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ ఉన్నాయి. 

ఈ 8 జట్లను గ్రూప్-ఎ, గ్రూప్ - బిగా డివైడ్ చేశారు. అందులో గ్రూప్-ఎలో.. భారత్-A, పాకిస్తాన్-A, యుఏఈ, ఒమన్ ఉన్నాయి. గ్రూప్-బి లో బంగ్లాదేశ్-A, ఆప్ఘనిస్తాన్-A, శ్రీలంక-A, హాంకాంగ్ ఉన్నాయి. ఈ షెడ్యూల్ ప్రకారం.. భారత్ A, పాకిస్తాన్ A మధ్య మ్యాచ్ నవంబర్ 16న జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ ఫార్మాట్ బట్టి.. గ్రూప్ దశలో టాప్-2లో ఉన్న జట్లు సెమీ ఫైనల్స్‌కు వెళతాయి. టోర్నమెంట్‌లో భాగంగా మొదటి, రెండవ సెమీ-ఫైనల్‌లు నవంబర్ 21న జరుగుతాయి. ఫైనల్ నవంబర్ 23న జరగనుంది.

దీంతో క్రికెట్ ఫ్యాన్స్‌ భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ను మరోసారి చూసే అవకాశం ఉంది. దీనికోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సారి అయినా.. భారత్ జట్టు పాక్ జట్టుతో కరచలనం చేస్తుందా? లేదా? చూడాలి. 

Advertisment
తాజా కథనాలు