Arshdeep Singh: విరాట్ కోహ్లీ ఫామ్‌పై అర్ష్‌దీప్ సింగ్ సంచలన కామెంట్స్..

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ డకౌట్ అయినప్పటికీ, అతని ఫామ్‌పై ఆస్ట్రేలియా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అర్ష్‌దీప్ సింగ్ గట్టి సమాధానం ఇచ్చాడు. "ఫామ్ అనేది కోహ్లీకి ఒక మాట మాత్రమే. ఈ సిరీస్‌లో అతను చాలా పరుగులు చేస్తాడు" అని తెలిపాడు.

New Update
Arshdeep Singh talks about virat kohli fam after ind vs aus 1st odi

Arshdeep Singh talks about virat kohli fam after ind vs aus 1st odi

భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ అక్టోబర్ 19న పెర్త్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ బ్యాట్ విఫలమైంది. అతడు 8 బంతుల ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తాడని అంతా భావించినప్పటికీ, మిచెల్ స్టార్క్ చేతిలో డకౌటయ్యాడు. మ్యాచ్ తర్వాత, అర్ష్‌దీప్ సింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. అక్కడ కోహ్లీ డకౌట్ అవ్వడంపై వచ్చిన విమర్శలకు ధీటైన జవాబిచ్చాడు. 

Arshdeep Singh talks about virat kohli

విరాట్ కోహ్లీ 0 పరుగులకే ఔటైన తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన ఒక జర్నలిస్ట్ అర్ష్‌దీప్ సింగ్‌ను ఒక ప్రశ్న అడిగారు. దానికి ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సరైన సమాధానమిచ్చాడు. ''ఫామ్ అనేది అతనికి కేవలం ఒక పదం మాత్రమే. అతను భారతదేశం తరపున 300కు పైగా వన్డేలు ఆడాడు. ఎలా ఆడాలి, ఎలా పుంజుకోవాలో అతనికి బాగా తెలుసు. అతనితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం మాకు ఒక అదృష్టం. ఈ సిరీస్‌లో అతని నుంచి చాలా పరుగులు వస్తాయని నేను భావిస్తున్నాను." అని చెప్పుకొచ్చాడు. 

ఒక మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన కోహ్లీ లాంటి గొప్ప ఆటగాడిని విమర్శించడం సరికాదని.. అతని అనుభవం, సామర్థ్యం ఈ సిరీస్‌లో తప్పకుండా కనిపిస్తాయని అర్ష్‌దీప్ బలంగా పేర్కొన్నాడు. వన్డే ఫార్మాట్ గురించి అడిగినప్పుడు అర్ష్‌దీప్ మాట్లాడుతూ.. "అతను ఆడుతున్న ఫార్మాట్ పరంగా, అతను దానిపై ప్రావీణ్యం సంపాదించాడు. కాబట్టి దాని గురించి అతను ఎలా భావిస్తున్నాడో నాకు తెలియదు." అని చెప్పుకొచ్చాడు. 

ఇక వర్షం కారణంగా మ్యాచ్‌ను 26 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 14 బంతుల్లో 8 పరుగులు చేయగా, శుభ్‌మాన్ గిల్ 18 బంతుల్లో 10 పరుగులు చేశాడు. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన కెఎల్ రాహుల్ 31 బంతుల్లో 38 పరుగులు చేశాడు. లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియా కేవలం 21.1 ఓవర్లలోనే మ్యాచ్‌ను గెలుచుకుంది.

Advertisment
తాజా కథనాలు