/rtv/media/media_files/2025/04/18/IV6CIX7RrXwnrFFrGNan.jpg)
Anaya Bangar alleges harassment
Anaya Bangar: భారత క్రికెటర్, మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ తనయుడు ఆర్యన్ బంగార్ లింగ మార్పిడి చేసుకున్న సంగతి తెలిసిందే. అబ్బాయి నుంచి అమ్మాయిగా మారారు. అనయా బంగర్ గా మారిన ఆమె ప్రస్తుతం లండన్ లో ఉంటున్నారు. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో అనయా చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. లింగ మార్పిడి తరువాత తాను ఎదుర్కొన్న బాధలను, పలు క్రికెటర్ల నుంచి ఎదురైనా వేధింపులను బయటపెట్టారు.
న్యూడ్ ఫొటోలు పంపిస్తూ
లింగ మార్పిడి తర్వాత కొందరు క్రికెటర్లు అసభ్యకరమైన ఫొటోలు పంపేవారని.. తరచూ తనకు న్యూడ్ ఫొటోలు పంపిస్తూ వేధించేవారని సంచలన ఆరోపణలు చేశారు. అందరి ముందు సపోర్ట్ చేస్తున్నట్లుగా మాట్లాడేవారు.. ఆ తర్వాత ఎవరూ లేని సమయంలో పక్కన కూర్చొని ఫొటోలు పంపమని అడిగేవారని వాపోయింది. తాను ఇండియాలో ఉన్నప్పుడు ఓ వెటరన్ క్రికెటర్ కు తన పరిస్థితి గురించి చెప్పగా.. సరే పద కారులో వెళ్దామని చెప్పి ఓదార్చాడు. ఆ తర్వాత 'స్లీప్ విత్ మీ' అని అడిగాడని ఎమోషనల్ అయ్యింది అనయా. తొలినాళ్లలో ఇలాంటి పరిస్థితులతో చాలా ఇబ్బంది పడినట్లు తెలిపింది.
అలాగే తాను అబ్బాయిగా ఉన్న సమయంలో.. ఇప్పుడున్న యువ క్రికెటర్లు ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్ సహా అనేక మందితో కలిసి క్రికెట్ ఆడేవాడినని గుర్తుచేసుకుంది. కానీ ఆ సమయంలో తన గురించి వారెవరికీ చెప్పలేదని తెలిపింది. ఎందుకంటే.. నాన్న అందరికీ తెలిసిన వ్యక్తి కావడంతో దాల్చసి వచ్చిందని పేర్కొంది. సోషల్ మీడియాలో పరోక్షంగా మాత్రమే కాదు కొందరు సీనియర్, వెటరన్ ప్లేయర్లు నుంచి నేరుగా మాటల వేధింపులకు గురైనట్లు తెలిపింది.
అనయ ఇంకా మాట్లాడుతూ.. తండ్రి సంజయ్ బంగర్ మాదిరిగానే తాను కూడా క్రికెటర్ అవ్వాలని భావించారట. అయితే 2023లో ఐసీసీ తీసుకున్న నిర్ణయంతో ఆటకు దూరమైనట్లు తెలిపారు. మహిళా క్రికెట్ లోకి ట్రాన్స్ జెండర్స్ కి అవకాశం లేదని నిబంధనలు తీసుకొచ్చింది. దీంతో తనకు క్రికెట్ ఆడే అవకాశం లేకపోయిందని అసంతృప్తి చెందారు.
telugu-news | latest-news
Also Read: Cinema: నిన్న డ్రగ్స్... ఇవాళ లైంగిక ఆరోపణలు.. మలయాళ నటుడు టామ్ చాకో నిర్వాకం
 Follow Us