IPL-2025: ఐపీఎల్ 2025 మెగా వేలం షార్ట్ లిస్ట్ ఇదే.. ఐపీఎల్ 2025 మెగా వేలానికి అంతా సిద్దమైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. వేలంలో పాల్గొనడానికి 1,574 మంది క్రికెటర్లు తమ పేర్లు నమోదు చేసుకోగా.. వారిలో 574 మందిని షార్ట్‌లిస్ట్ చేశారు. నవంబర్ 24న మెగా వేలం జరగనుంది. By Manogna alamuru 15 Nov 2024 in స్పోర్ట్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి IPL 2025 Short List: ఈసారి ఐపీఎల్ హాడావుడి మామూలుగా లేదు. రిటెన్షన్ లిస్ట్ దగ్గర నుంచి ప్రతీది హాట్ న్యూసే అవుతోంది. ఇప్పుడు తాజాగా వేలానికి సంబంధించి షార్ట్ లిస్ట్ అవుట్ అయింది. దీన్ని ఐపీఎల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మెగా వేలాన్ని ఈనెల 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో నిర్వహించనున్నారు. నవంబర్ 24న భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ప్రారంభం కానుంది. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ వేలానికి మల్లికా సాగర్ యంకరింగ్ చేశారు. అప్పుడు ఆమె విపరీతంగా ఫేమస్ అయ్యారు. దీంతో ఈసారి కూడా ఆమెతోనే చేయించనున్నారని తెలుస్తోంది. ఈ లిస్ట్‌లో భారత క్యాప్‌డ్ ప్లేయర్లు 48, విదేశీ క్యాప్‌డ్ ప్లేయర్లు 193, అన్‌క్యాప్‌డ్ భారత ఆటగాళ్లు 318, విదేశీ అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు 12, అసోసియేట్ దేశాలకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు వేలంలో పాల్గొననున్నారు.కనీస ధర రూ.2 కోట్లు ఉన్న ఆటగాళ్లు 81 మంది ఉండగా..బేస్ ధర రూ.1.50 కోట్లు ఉన్న ప్లేయర్లు 27 మంది. ఇందులో అత్యధికంగా 320 మంది ఆటగాళ్లు కనీస ధర రూ.30 లక్షలతో వేలం బరిలో నిలిచారు. తొలి సెట్‌లో జోస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్ ఉన్నారు. తర్వాతి సెట్‌లో యుజ్వేంద్ర చాహల్, లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, షమిలకు చోటు దక్కింది. ఇక సెట్ 3లో హ్యారీ బ్రూక్, డేవాన్ కాన్వే, జేక్ ఫ్రేజర్, మార్‌క్రమ్, దేవదత్ పడిక్కల్, రాహుల్ త్రిపాఠి, డేవిడ్ వార్నర్ ఉన్నారు. IPL Auction - Full List Of Players By Base Price Also Read: Space X: ఢిల్లీ నుంచి అమెరికాకు అరగంటలోనే..స్పేస్ ఎక్స్ కొత్త ప్రయోగం మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి