Shubman Gill : శుభ్‌మన్ గిల్ సెంచరీ..  కోహ్లీ రికార్డు బద్దలు

తాజాగా మాంచెస్టర్‌లో జరుగుతోన్న నాలుగో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేయడం ద్వారా  కెప్టెన్‌గా తన మొదటి టెస్ట్ సిరీస్‌లోనే నాలుగు సెంచరీలు సాధించిన ఆటగాడిగా గిల్ నిలిచాడు.

New Update
kohli-vs-gill

ఇంగ్లండ్‌తో జరుగుతోన్న టెస్ట్ సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శనతో  ఆకట్టుకుంటూ పలు రికార్డులను బద్దలు కొడుతున్నాడు టీమిండియా కెప్టెన్ శుభ్ మన్ గిల్.  తాజాగా మాంచెస్టర్‌లో జరుగుతోన్న నాలుగో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేయడం ద్వారా  కెప్టెన్‌గా తన మొదటి టెస్ట్ సిరీస్‌లోనే నాలుగు సెంచరీలు సాధించిన ఆటగాడిగా గిల్ నిలిచాడు. ఈ ఘనత సాధించిన దిగ్గజాలు సర్ డాన్ బ్రాడ్‌మన్, సునీల్ గవాస్కర్ సరసన గిల్ చేరాడు. శుభ్‌మన్ గిల్ ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో 700 పరుగుల మార్కును దాటిన తొలి ఆసియా బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.  ఒక టెస్ట్ సిరీస్‌లో 700+ పరుగులు సాధించిన భారత బ్యాటర్లలో గిల్ మూడో స్థానంలో నిలిచాడు.

ఆసియా కెప్టెన్‌గా గిల్

సునీల్ గవాస్కర్ (రెండుసార్లు), యశస్వి జైస్వాల్ (ఒకసారి) మాత్రమే గతంలో ఈ ఘనత సాధించారు. ఈ సిరీస్‌లో గిల్ మొత్తం 700* పరుగులు చేశాడు. ఇక ఇంగ్లండ్ గడ్డపై ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా కెప్టెన్‌గా గిల్ (601*) విరాట్ కోహ్లీ (2014లో 593 పరుగులు) రికార్డును అధిగమించాడు. శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ జోడీ ఒకే టెస్ట్ సిరీస్‌లో 500 పరుగులకు పైగా పరుగులు చేసిన భారత్‌కు చెందిన మూడో జోడీగా నిలిచింది. చివరిసారిగా ఈ ఘనత 1971లో సునీల్ గవాస్కర్ , దిలీప్ సర్దేశాయ్ జోడీ వెస్టిండీస్ పై సాధించింది. 35 సంవత్సరాల తర్వాత మాంచెస్టర్‌లో సెంచరీ చేసిన తొలి భారతీయుడిగా గిల్ నిలిచాడు. 

Advertisment
తాజా కథనాలు