స్పైస్‎జెట్‎లో భీకరమంటలు, కాలి బూడిదైన విమానం...!!

ఢిల్లీ విమానాశ్రయంలో స్పైస్‌జెట్ విమానం మంటల్లో చిక్కుకుంది. అకస్మాత్తుగా భారీ మంటలు చెలరేగడంతో విమానం కాలి బూడిదయ్యింది. మంగళవారం ఆగి ఉన్న స్పైస్‎జెట్ విమానంలో మంటలు చెలరేగాయి. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

స్పైస్‎జెట్‎లో భీకరమంటలు, కాలి బూడిదైన విమానం...!!
New Update

publive-image

మంగళవారం ఢిల్లీ విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇంజన్ మెయింటెనెన్స్ పనుల్లో స్పైస్‌జెట్ విమానంలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. ఈ మంటల్లో విమానం కాలిబూడిదయ్యింది. ఎయిర్‌క్రాఫ్ట్ నిర్వహణలో ఉన్న సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ఎయిర్‌లైన్ కంపెనీ తెలిపింది. స్పైస్‌జెట్ ప్రతినిధి మాట్లాడుతూ, "జులై 25న, నిర్వహణలో ఉన్న స్పైస్‌జెట్ Q400 విమానం, నిష్క్రియ శక్తితో ఇంజిన్ గ్రౌండ్ రన్ చేస్తున్నప్పుడు, AME 1 ఇంజిన్‌పై అగ్ని ప్రమాద హెచ్చరికను గమనించింది. దీనిని చూసినప్పుడు, విమానం అగ్నిమాపక బాటిల్ డిశ్చార్జ్ అయ్యింది. ముందుజాగ్రత్తగా అగ్నిమాపక దళాన్ని పిలిచాం. ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెను ముప్పు తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని తెలిపారు.

మంగళవారం సాయంత్రం 4గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు విమానయాన సంస్ధ అధికార ప్రతినిధి తెలిపారు. క్యూ 400విమానం మెయింటెనెన్స్ లో ఉన్నప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇండిగో విమానం ఇంజిన్‌లో మంటలు:
గత ఏడాది అక్టోబర్‌లో, ఇండిగో విమానం ట్యాక్సీలో వెళుతుండగా ఇంజిన్‌ ఒకదానిలో మంటలు చెలరేగడంతో ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. 184 మందితో బెంగుళూరుకు బయలుదేరిన A320 విమానం తర్వాత తిరిగి వచ్చింది. విమానాశ్రయానికి టాక్సీ చేస్తున్నప్పుడు విమానం ఇంజిన్‌లలో ఒకదానిలో నిప్పురవ్వలు ఎగురుతూ కనిపించాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

#video #fire #spice-jet #delhi-airport
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe