Special Trains: స్వాతంత్య్ర దినోత్సవం, వీకెండ్ సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల మధ్య పలు తారీఖుల్లో ఎనిమిది ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. నర్సాపూర్- సికింద్రాబాద్, కాకినాడ టౌన్- సికింద్రాబాద్, కాచిగూడ-తిరుపతి మధ్య మొత్తం ఎనిమిది రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.
నర్సాపురం-సికింద్రాబాద్ ఆగస్టు 18 ఆదివారం నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్ కు బయల్దేరనుంది. సికింద్రాబాద్ -నర్సాపూర్ ట్రైన్ ఆగస్టు 19 సాయంత్రం మొదలై మరుసటి రోజుకి నర్సాపూర్ చేరుకోనుంది.
కాకినాడ్ టౌన్ - సికింద్రాబాద్ ఆగస్టు 17, 19 తేదీల్లో రాత్రి కాకినాడల్ బయల్దేరి...ఆ మరుసటి రోజుల్లో ఉదయం 9.05 గంటలకు కాకినాడ పట్టణానికి చేరుకుంటుంది. అలాగే 18,20 తేదీల్లో సికింద్రాబాద్ లో సాయంత్రం 6.20 గంటటకు బయల్దేరనున్న సికింద్రాబాద్-కాకినాడ టౌన్ ట్రైన్ ఆగస్టు 19, 21 తేదీల్లోకాకినాడ టౌన్ కు చేరుకోనుంది.
అలాగే కాచిగూడ- తిరుపతి రైలు ఆగస్టు 16 న రాత్రి 10.30 గంటలకు కాచిగూడలో బయల్దేరి ఆగస్టు 17న ఉదయం 10.25 గంటలకు తిరుపతి చేరుకోనుంది. అలాగే తిరుపతి-కాచిగూడ ఆగస్టు 17న తిరుపతిలో రాత్రి బయల్దేరి మరుసటి రోజు కాచిగూడకు చేరుకుంటుంది.
కాచిగూడ టౌన్ సికింద్రాబాద్ ట్రైన్ ఆగస్టు 18 న సాయంత్రం 6.30 కి కాకినాడలో బయల్దేరి..మరుసటి రోజు ఉదయాన్నే 6 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకోనుంది. సికింద్రాబాద్ లో ఆగస్టు 19 న రాత్రి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ పట్టణానికి చేరుకుంటుంది.
Also Read: ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన.. సమంత కీలక వ్యాఖ్యలు