శబరిమలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే అయ్యప్ప భక్తులకు ఇండియన్ రైల్వే శుభవార్త చెప్పింది. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడిపించబోతున్నట్లు తెలిపింది. నవంబర్ 19న సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 2.40కు సికింద్రాబాద్-కొల్లాం ప్రత్యేక రైలు బయలుదేరనున్నట్లు వివరాలు వెల్లడించింది. By srinivas 17 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ఇండియన్ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. జనవరి 15న భారీ సంఖ్యలో భక్తులు శబరి ఆలయ దర్శనం చేసుకోనుండా అక్కడికి వెళ్లేందుకు ప్రత్యేక రైలు నడిపించనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్ లైన్ లోనూ అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రతి యేడాదిలాగే ఈసారి కూడా అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అయ్యప్ప ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే ఇండియన్ రైల్వే కూడా ప్రయాణికుల కోసం తమవంతు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు సికింద్రాబాద్-కొల్లాం ప్రత్యేక రైలు (రైలు నంబరు 07121/07122) ఈ నెల 19వ తేదీ సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 2.40కి బయలుదేరి 20వ తేదిన రాత్రి 11.55 గంటలకు కొల్లాం చేరుకుంటుందని తెలిపింది. అలాగే తిరిగి ఇదే బండి 21న కొల్లాంలో ఉదయం 2.30 గంటలకు బయలుదేరి 22న ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని వెల్లడించింది. ఇక ఈ రైలు జనగామ, ఖాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, మధిర, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, పాల్కాడ్, త్రిశూర్, ఎర్నాకుళం స్టేషన్లలో ఆగుతుందని, భక్తులందరూ ఇది గమనించాలని సూచించింది. Also read :మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి.. కేంద్రానికి సీఎం హెచ్చరిక అలాగే మరోక ప్రత్యేక రైలు (07119/07120 నర్సాపూర్-కొట్టాయం) నవంబర్ 19ననర్సాపూర్‌లో మధ్యాహ్నం 3.50కి బయలుదేరి 20న సాయంత్రం 4.50కు కొట్టాయం చేరుకుంటుంది. తిరిగి 20వ తేదీ కొట్టాయంలో రాత్రి 7కు బయలుదేరి 21 రాత్రి 9 గంటలకు నర్సాపూర్ చేరుతుంది. పాలకొల్లు, భీమవరంటౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, తిరుప్పూర్, కోయంబత్తూర్, త్రిశూర్, ఎర్నాకుళం స్టేషన్లలో ఆగుతుందని తెలిపారు. ఇదిలావుంటే.. ఈయేడాది అయ్యప్ప ఆలయం భక్తుల్ని విశేషంగా ఆకర్షించనుందని, ఎంతో ఖర్చుపెట్టి గుడిని మరింత అందంగా అలంకరించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. #sabarimala #special-trains మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి