TS EAMCET Counselling 2023: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్దేశించిన ఎంసెట్-2023 (TS EAMCET) కౌన్సెలింగ్‌లో భాగంగా మూడు విడతల సీట్లకేటాయింపు ప్రక్రియ పూర్తయిన సంగతి తెలిసిందే. తుదివిడత కౌన్సెలింగ్ తర్వాత రాష్ట్రంలో ఇంకా 19 వేలకుపైగా ఇంజినీరింగ్ సీట్లు మిగిలిపోయాయి. ఈ మిగిలిపోయిన సీట్ల భర్తీకి ఇవాళ్టి నుంచి స్పెషల్ కౌన్సెలింగ్‌ను టీఎస్ ఉన్నత విద్యామండలి నిర్వహింస్తున్నారు. ఇందులో అత్యధిక సీట్లు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీట్లే ఉన్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ తదితర బ్రాంచీల్లో చాలా సీట్లు మిగిలిపోయాయి. అయితే ఇవాళ్టి నుంచి ఈనెల 25 వరకు ప్రత్యేక కౌన్సెలింగ్ జరుగనుంది.
అయితే ఇవాళ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని విద్యామండలి తెలిపింది. ఇక విద్యార్థులకు రేపటి నుంచి (ఆగస్టు 18) సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఇది పూర్తయిన విద్యార్థులు ఈనెల 19 వరకు వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకోవాలి. వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 23న సీట్లను కేటాయిస్తారు. అభ్యర్థులు ఆగస్టు 23 నుంచి 25 వరకు నిర్ణీట ట్యూషన్ ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అదే తేదీల్లో సంబంధిత కళాశాలలోనూ నేరుగా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
అయితే రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా మరో విడతలో కౌన్సెలింగ్‌కు నిర్ణయించినట్లు తలిపారు. నేడు స్లాట్ బుకింగ్.. రేపు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 19 వరకు తుది విడత వెబ్ ఆప్షన్లు స్వీకరించి 23న సీట్లు కేటాయిస్తారు. ఇక ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ డిప్లొమా కోర్సుల్లో సీట్ల భర్తీకీ ఇప్పటికే 4వ విడతల కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. అన్ని విడతల కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన సీట్ల భర్తీకి నేడు యూనివర్సిటీ ఆడిటోరియంలో వాక్‌ఇన్ కౌన్సెలింగ్ నిర్వహింస్తున్నారు. పాలిసెట్-2023లో ర్యాంకు పొందిన వారికి ఈ కౌన్సెలింగ్‌లో మొదటి ప్రాధాన్యత ఇచ్చి.. ఆ తర్వాత పదోతరగతి పాసైన వారికి రెండో ప్రాధాన్యత ఇస్తారు.
Also Read: విద్యార్థులకు అలెర్ట్.. జేఈఈ మెయిన్స్ పరీక్ష ఎప్పుడంటే?