TDP Ex MLA'S: పార్టీ మారిన టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ

స్పీకర్ తమ్మినేని పార్టీ మారిన టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పార్టీ మారడంపై వివరణ ఇవ్వాలని ఆదేశం ఇచ్చారు. కరణం బలరామ్‌, మద్దాల గిరి, వాసుపల్లి గణేశ్‌, వల్లభనేని వంశీకి నోటీసులు అందాయి.

TDP Ex MLA'S: పార్టీ మారిన టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ
New Update

EX TDP MLA'S: పార్టీ మారిన టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు స్పీకర్ తమ్మినేని. ఈ నెల 29న స్పీకర్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు శాసనసభ కార్యదర్శి. 29న మధ్యాహ్నం 2.45 గంటలకు హాజరై పార్టీ మారడంపై వివరణ ఇవ్వాలని ఆదేశం ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ లిస్టులో కరణం బలరామ్‌, మద్దాల గిరి, వాసుపల్లి గణేశ్‌, వల్లభనేని వంశీకి నోటీసులు పంపారు. పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని టీడీపీ విప్‌ డోలా బాలవీరాంజనేయ స్వామి పిటిషన్‌ దాఖలు చేశారు. డోలా పిటిషన్‌పై స్పందించి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు స్పీకర్ తమ్మినేని.

తమ్మినేని గంటా సవాల్..

తన రాజీనామా ఆమోదంపై హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్. మూడేళ్ల కింద చేసిన రాజీనామాను స్పీకర్ తమ్మినేని ఇప్పుడు ఆమోదించడంపై అభ్యంతరం తెలిపారు. రాజీనామా ఆమోదంలో ప్రొసీజర్ ఫాలో కాలేదంటూ పిటిషన్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ తమ్మినేని తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. గంటా శ్రీనివాస్ వేసిన పిటిషన్ ఈ నెల 29న విచారణకు రానుంది. 

ALSO READ: అలా చేసింది జగనే.. సాక్ష్యం విజయమ్మ.. షర్మిల సంచలన వ్యాఖ్యలు!

ఎన్నికలకు ముందే..

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలుగు దేశం పార్టీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం ఆమోదించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2022 ఫిబ్రవరిలో గంటా శ్రీనివాస్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు రాజీనామాను పెండింగ్‌లో పెట్టిన స్పీకర్ తమ్మినేని తీరా ఎన్నికల ముందు రాజీనామాకు ఆమోదం తెలపడంపై ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 

DO WATCH: 

#ap-assembly #tdp-mlas #ap-latest-news #speaker-thammineni
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe