మామూలుగా వాతావరణం లేని చోట ధ్వని ప్రయాణించదని థియరీ. అలా అయితే స్పేస్ శూన్యం కాబట్టి అక్కడ ఎటువంటి ధ్వనీ ఉండదు....అంతే అనుకుంటున్నారా. కానీ లేదండీ అక్కడ కూడా ధ్వని ఉంటుంది అంట. అయితే భూమ్మీద ఉండేంత ఉండదు. స్పేస్ లో వేలకొద్దీ నక్షత్రాలు, గెలాక్సీ క్లస్టర్లు అన్నీ ఫుల్ గ్యాస్ తో నిండి ఉంటాయిట. వాటిలో ధ్వని ప్రయాణిస్తుంది అని చెబుతున్నారు. 2003లో బ్లాక్ హోల్ నుంచి వచ్చిన శబ్దాలను గుర్తించామని గుర్తుచేస్తున్నారు. అయితే అక్కడ వినిపించిన ధ్వని మనకు సాధారణంగా వినపబే స్థాయిలో ఉండదు కాబట్టి దాన్ని ఫ్రీక్వెన్సీ పెంచి మనకు వినిపించారు.
Also Read:విదేశీయులు మెచ్చే భారత్..అద్భుతాలకు నెలవు కోకోనట్ ఐలాండ్
అలాగే స్పేస్ లోకి వెళ్ళిన అస్ట్రోనాట్స్ వాసనలను కూడా పసిగట్టారుట. స్పేస్ వాక్ చేసి తిరిగి వచ్చిన ప్రతీసారీ తమకు ఏదో కాలిన వాసన వస్తుందని చెప్తారుట. మాసం కానీ, ఇనుము కాలిన వాసలా కానీ ఉంటుందని అంటారుట వాళ్ళు. స్పేస్ లో చాలా ఎక్కువగా రేడియేషన్ ఉంటుంది. బయటకు వెళ్ళినప్పుడు ఆస్ట్రోనాట్స్ దానికి లోనవుతారు. అప్పడు వాళ్ళు వేసుకునే స్పేస్ సూట్స్, ఇంకా ఇతర పరికాలు హైఎనర్జీ వైబ్రేషన్ కు గురవుతాయిట. అప్పడు విడుదల అయ్యే పార్టికల్స్ నుంచే వచ్చే వాసనే కాలిన వాసనలా ఉంటుందని తేల్చారు శాస్త్రవేత్తలు.
ఇక స్పర్శ విషయానికి వస్తే దీనిలో ఎలాంటి మార్పులు లేదని అంటున్నారు. భూమి మీద ఎలా ఉంటుందో స్పేస్ లో కూడా అలాగే ఉంటుందని అంటున్నారు. అయితే అక్కడకు వెళ్ళొచ్చాక చర్మం మరింత మృదువుగా మాత్రం అవుతుందని చెబుతున్నారు. అలాగే రుచి విషయానికి వస్తే అక్కడ కూడా చాలా రకాల రసాయనాలు ఉన్నాయని వాటివల్ల రకరకాల రుచులు ఉంటాయని అంటున్నారు. ఈథైల్ ఫార్మేట్ రసాయనం వల్ల రాస్ బెర్రీ పళ్ళ రుచి, ఇంకా చేదు, వగరు, పులుపు లాంటి రుచులు కూడా ఉంటాయని చెబుతున్నారు.
అదీ సంగతి...అక్కడ కూడా మనం అన్ని రకాల అనుభూతులను పొందవచ్చు. అయితే భూమ్మీద ఉండేంద మాత్రం ఎక్సెపెక్ట్ చేయకూడదు అంతే. రాను రాను టెక్నాలజీ మరింత అభివృద్ధి చెంది దానికి కూడా ఏదో రెమిడీ కనిపెట్టేస్తారు అనుకోండి...కానీ అప్పటివరకు మాత్రం ఓపికా వెయిట్ చేయాలి అంతే.