ISRO: భూమి, చంద్రుడితో ఆదిత్య ఎల్-1 సెల్ఫీలు.. వీడియో చూడాల్సిందే భయ్యా!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సూర్య-భూమి ఎల్1 పాయింట్ వద్ద క్యాప్చర్ అయిన ఫొటోలను షేర్ చేసింది. ఆదిత్య-ఎల్1 సెల్ఫీ తీసుకుంటూ భూమి -చంద్రుని చిత్రాలను క్లిక్ చేసింది. ఆదిత్య-ఎల్1 క్లిక్ చేసిన చిత్రాలను, సెల్ఫీని కూడా స్పేస్ ఏజెన్సీ షేర్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్మీడియాలో వైరల్గా మారింది