IND vs SA: షాకిచ్చిన సఫారీలు.. రెండో వన్డేలో చిత్తయిన టీమిండియా

పోర్ట్‌ ఎలిజబెత్‌ వేదికగా సౌతాఫ్రికాతో రెండో వన్డేలో భారతజట్టు 8 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. భారత్‌ నిర్దేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లలో ఛేదించింది. టోనీ జోర్జీ (119) అజేయ శతకంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.

New Update
IND vs SA: షాకిచ్చిన సఫారీలు.. రెండో వన్డేలో చిత్తయిన టీమిండియా

IND vs SA: పోర్ట్‌ ఎలిజబెత్‌ వేదికగా సౌతాఫ్రికాతో రెండో వన్డేలో భారతజట్టు 8 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. భారత్‌ నిర్దేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లలో ఛేదించింది. యువ ఓపెనర్‌ టోనీ జోర్జీ (119) అజేయ శతకంతో సఫారీ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆతిథ్య జట్టు విజయంతో సిరీస్‌ 1-1తో సమమైంది. నిర్ణయాత్మకమైన మూడో వన్డే గురువారం జరగనుంది.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తక్కువ పరుగులకే చేతులెత్తేసింది. 46.2 ఓవర్లలో 211 పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. సాయి సుదర్శన్‌ (62; 83 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) మరోసారి హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (56; 64 బంతుల్లో 7 ఫోర్లు) కూడా ఫిఫ్టీ స్కోర్‌ చేశాడు. వీరు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో నండ్రి బర్గర్ 3, బ్యురాన్ హెండ్రిక్స్‌ 2, కేశవ్‌ మహరాజ్‌ 2; లిజాడ్ విలియమ్స్‌, మార్‌క్రమ్‌ చెరొక వికెట్ పడగొట్టారు.

ఇది కూడా చదవండి: బ్యాటర్లకు ఇక కళ్లెం.. బీసీసీఐ తాజా నిర్ణయంతో పేసర్లకు అడ్వాంటేజ్!

ఇన్నింగ్స్‌ రెండో బంతికే రుతురాజ్‌ గైక్వాడ్ (4)ను బర్గర్ ఎల్‌బీడబ్ల్యూగా వెనక్కు పంపాడు. తర్వాత తిలక్‌ వర్మతో కలసి సాయి సుదర్శన్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించేందుకు ప్రయత్నించాడు. వారు నిలదొక్కుకుంటున్న సమయంలో బర్గర్ బౌలింగ్‌లో హెండ్రిక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి తిలక్‌ ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్‌ మొదట్లో కాస్త ఆలోచించినా, క్రమంగా దూకుడు పెంచాడు. తర్వాత 60 బాల్స్‌లో హాఫ్‌ సెంచరీ నమోదు చేసిన సాయిని విలియమ్స్‌ ఔట్‌ చేశాడు. అంతే.. తర్వాత వచ్చిన బ్యాటర్లంతా తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. సంజు శాంసన్ (12)ను హెండ్రిక్స్‌ బౌల్డ్ చేశాడు. హాఫ్‌ సెంచరీ చేసిన రాహుల్ బర్గర్ బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. రింకు సింగ్ (17), కుల్‌దీప్ యాదవ్ (1)లను కేశవ్‌ మహరాజ్‌ ఔట్‌ చేశాడు. మార్‌క్రమ్‌ అక్షర్ పటేల్ (7; 23 బంతుల్లో)ను వెనక్కు పంపేశాడు. చివర్లో అర్ష్‌దీప్‌ సింగ్ 1 ఫోర్, 1 సిక్సర్‌తో 18 పరుగులు రాబట్టడంతో స్కోరు 200 పరుగులైనా దాటింది.

లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు ఈజీగా ఛేదించింది. రిజా హెండ్రిక్స్‌ (52) హాఫ్‌ సెంచరీ బాదేయగా, వాండర్ డసెన్ (36) రాణించాడు. ఇక మరో యువ ఓపెనర్‌ టోనీ జోర్జీ (119) సెంచరీతో చెలరేగాడు. ఫస్ట్‌మ్యాచ్‌లో ప్రొటిస్‌ జట్టుకు చుక్కలు చూపించిన భారత బౌలర్లు ఈ మ్యాచ్‌లో తేలిపోయారు. అర్ష్‌దీప్‌, రింకూ సింగ్‌ తలో వికెట్‌ తీశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు