Bengalore: సౌత్‌లో తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రారంభం..ఎక్కడంటే! దక్షిణ భారతదేశంలో తొలి డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ కర్ణాటకలో ప్రారంభమైంది. రూ.449 కోట్లతో బెంగళూరులో నిర్మించిన ఫ్లైఓవర్‌ను డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలోనే తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌గా రికార్డు సృష్టించింది. By Bhavana 17 Jul 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి Bengalore: దక్షిణ భారతదేశంలో తొలి డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ కర్ణాటకలో ప్రారంభమైంది. రూ.449 కోట్లతో బెంగళూరులో నిర్మించిన ఫ్లైఓవర్‌ను డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలోనే తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌గా రికార్డు సృష్టించింది. 3.36 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్.. సిల్క్ బోర్డు జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ట్రాఫిక్‌ను సులభతరం చేయనుంది. రాగిగుడ్డ మెట్రో స్టేషన్ నుంచి ఫ్లై ఓవర్ మొదలు కానుంది. వాహనాల రాకపోకల కోసం ఎగువ డెక్‌లో ఎలివేటెడ్ మెట్రో కారిడార్, దిగువ డెక్‌లో ఎలివేటెడ్ రోడ్డు ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ రోడ్డు, మెట్రో ఫ్లైఓవర్ కలిగి ఉంది. ఇందులో ఐదు వేర్వేరు ర్యాంప్‌లు ఉన్నాయి. మూడు ర్యాంపుల పనులు పూర్తికాగా.. రెండు విభాగం నిర్మాణ దశలో ఉంది. దక్షిణ భారతదేశంలో ఇలాంటి డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మించడం ఇదే మొదటిసారి. ఈ ఫ్లై ఓవర్ 3.36 కి.మీ పొడవుతో రాగిగుడ్డ మెట్రో స్టేషన్‌లో ప్రారంభమై సిల్క్‌బోర్డ్ జంక్షన్‌లో ముగుస్తుంది. ఫ్లైఓవర్‌తో పాటు వెళ్లే పసుపు లైన్ మెట్రో పనులు ఇంకా పూర్తికాలేదు. అయితే బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకారం ఇది ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభం కానుంది. ఇక నగరంలోని ఏ వైపు నుంచి అయినా 30-40 నిమిషాల సమయం ఆదా అవుతుంది. రెండు ర్యాంప్‌ల నిర్మాణం మే 2025 నాటికి పూర్తవ్వనున్నట్లు సమాచారం. Also read: ఎయిర్ పోర్ట్ లో గుండెపోటుతో కుప్పకూలిన వృద్దుడు..సీపీఆర్ చేసి కాపాడిన వైద్యురాలు! #double-deccar #south #bengalore #train మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి