Railway Jobs 2024: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. 1202 ఖాళీలకు నోటిఫికేషన్! సౌత్ ఈస్టర్న్ రైల్వేలో పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో అసిస్టెంట్ లోకో పైలట్, ట్రైన్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. పూర్తి వివరాలు ఈ కథనంలో.. By Bhavana 30 May 2024 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి RRC SER Recruitment 2024: సౌత్ ఈస్టర్న్ రైల్వేలో పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో అసిస్టెంట్ లోకో పైలట్, ట్రైన్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆర్పీఎఫ్/ఆర్పీఎస్‌ఎఫ్ అసిస్టెంట్లు , సిబ్బంది , క్యాటరింగ్ ఏజెంట్లు, జనరల్ డిపార్ట్‌మెంట్ కాంపిటీటివ్ కాకుండా సౌత్ ఈస్టర్న్ రైల్వేలో అన్ని అర్హత గల రెగ్యులర్ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాల ఖాళీల వివరాలు.. 1202 అసిస్టెంట్ లోకో పైలట్ ఖాళీలు : 827 రైలు మేనేజర్ ( గూడ్స్ గార్డ్ ) : -375 జీతం: అసిస్టెంట్ లోకో పైలట్: 5200 –--20,200 +GP 1900 రైలు మేనేజర్ ( గూడ్స్ గార్డ్ ): 5200 – 20,200 +GP 2800 అసిస్టెంట్ లోకో పైలట్ : ఆర్మేచర్ & కాయిల్ వార్డర్ /ఎలక్ట్రీషియన్/ మెకానిక్/ ఫిట్టర్/ హీట్ ఇంజన్ /ఇన్ స్ట్రుమెంట్ మెకానిక్/ ఇతర ట్రేడ్ మెట్రిక్యులేషన్ / ఎస్‌ఎస్‌ఎల్సీ ప్లస్ ITI లేదా గుర్తింపు పొందిన ఎన్‌సివిఎస్‌విటి ఎన్‌సివిటిటి/ సంవత్సరం డిప్లొమా సంస్థల నుంచి ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రైలు మేనేజర్: డిగ్రీ లేదా సమానమైన అర్హత ఉంటే చాలు. వయో పరిమితి: అన్ రిజర్డ్వ్ 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ- 18 నుంచి 45 ఏళ్లు ఎస్సీ/ఎస్టీ- 18 నుంచి 47 ఏళ్లు ఎంపిక ప్రక్రియ: ఎంపిక సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అధికారిక వెబ్ సైట్‌కు (www.rrcser.co.in) వెళ్లి ఆన్ లైన్ లో ఈ అప్లికేషన్ పై క్లిక్ చేసుకోవాలి. జూన్ 12 లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. Also read: వామ్మో ఏం ఎండలు..రోళ్లు పగలడం కాదు..ఏకంగా వాషింగ్ మెషినే పేలిపోయింది! #jobs #notification #south-eastren-railway #rrc-ser-recruitment మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి