Summer Holidays : మరి కొద్ది రోజుల్లో వేసవి సెలవులు రానున్నాయి. దీంతో ప్రయాణాలు(Journey) చేసేవారు ఎక్కువే ఉంటారు. ఈ క్రమంలోనే వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని రెండు నెలల ముందే రైలు టికెట్లను బుక్(Train Ticket Booking) చేసుకుంటున్నారు ప్రయాణికులు. దీంతో రైలు సీట్లన్ని కూడా రెండు నెలల ముందే ఫుల్ అయిపోయాయి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించేవారికి రైలు టికెట్లు దొరకకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకొని రైల్వే అధికారులు(Railway Officers) ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. పలు ప్రాంతాల మధ్య సేవలందిస్తున్న 32 ప్రత్యేక రైళ్ల సర్వీసులు(Railway Services) ను పొడిగించేందుకు నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు నిర్ణయించిన తేదీల్లో ఈ సర్వీసులను నడుపుతున్నట్లు అధికారులు వివరించారు.
పొడిగించిన రైలు వివరాలు ఇలా ఉన్నాయి...