TS : విద్యార్థులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. స్కాలర్షిప్ దరఖాస్తులపై కీలక ప్రకటన!
తెలంగాణ విద్యార్థులకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన స్టైఫండ్, ట్యూషన్ ఫీజుల అప్లికేషన్ గడువును పొడిగిస్తున్నట్లు ఎస్సీ సంక్షేమశాఖ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 31న తుది గుడవు ముగియనుండగా మరో 3 నెలలు అవకాశం కల్పించింది.