South central Railway: సంక్రాంతికి ఊరెళ్లలానుకుంటున్నారా..అయితే ఈ శుభవార్త మీకోసమే!

సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లే వారికి సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఓ తీపి కబురు చెప్పింది. మరో 32 ప్రత్యేక రైళ్లను పండుగ సందర్భంగా నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

First Private Train: దేశంలోనే తొలి ప్రైవేటు రైలు ప్రారంభం... ఎప్పటి నుంచి అంటే!
New Update

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అతి పెద్ద పండుగ ఏదైనా ఉంది అంటే సంక్రాంతి (Sankranthi) నే. మరి కొద్ది రోజుల్లో ఈ పండుగ రాబోతుంది. దేశంలో ఎక్కడెక్కడో ఉన్న తెలుగు వారంతా కూడా సొంతూర్లకు రావడానికి రెండు నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటుంటారు. ఈ క్రమంలోనే దక్షిణ మధ్య రైల్వే (South Central Railway)  ఓ శుభవార్త చెప్పింది.

ఇప్పటికే అన్ని రైళ్ల సీట్లలోని సీట్లన్ని నిండిపోయాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే మరోసారి వివిధ మార్గాల్లో 32 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. అది కూడా జనవరి 7 నుంచి జనవరి 27 వరకు మొత్తం 32 రైళ్లను నడపనున్నట్లు వివరించింది. వాటిలో ముఖ్యంగా హైదరాబాద్‌_కాకినాడ, సికింద్రాబాద్‌-నర్సాపూర్‌, హైదరాబాద్‌-కొచ్చువేలి, కాచిగూడ-భువనేశ్వర్‌, సికింద్రాబాద్‌- గూడూరు, సికింద్రాబాద్‌- తిరుపతి, శ్రీకాకుళం- వికారాబాద్‌ రూట్లలో ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.

ఈ ప్రత్యేక రైళ్లు అన్నింటిలోనూ అందరికి అందుబాటులో ఫస్ట్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ, థర్డ్ ఏసీ తో పాటు స్లీపర్‌, జనరల్‌ బోగీలు ఉండనున్నట్లు వివరించింది.

సికింద్రాబాద్‌ నుంచి బ్రహ్మపూర్‌- జనవరి 7,14 తేదీల్లో ప్రత్యేక రైలు నడవనుంది. బ్రహ్మాపూర్‌ నుంచి వికారాబాద్‌ కి జనవరి 8, 15 తేదీల్లో ప్రత్యేక రైలు తిరుగుతుంది. వికారాబాద్‌ నుంచి బ్రహ్మాపూర్ జనవరి 9, 16 తేదీల్లో ప్రత్యేక రైలు నడవనుంది. విశాఖ - కర్నూలు సిటీ కి ప్రత్యేక రైలు జనవరి 10,17,24 తేదీల్లో నడవనుంది.

కర్నూలు సిటీ నుంచి విశాఖపట్నం జనవరి 11,18, 25 తేదీల్లో , శ్రీకాకుళం నుంచి వికారాబాద్‌ జనవరి 12, 19, 26 తేదీల్లో, వికారాబాద్‌ నుంచి శ్రీకాకుళం జనవరి 13, 20, 27 తేదీల్లో , సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి జనవరి 10, 17న, తిరుపతి నుంచి సికింద్రాబాద్ జనవరి 11, 18న , సికింద్రాబాద్‌ నుంచి కాకినాడ టౌన్‌ జనవరి 12న, కాకినాడ టౌన్‌ సికింద్రాబాద్‌ జనవరి 13 న, సికింద్రాబాద్‌ బ్రహ్మాపూర్‌ జనవరి 8, 15 న , బ్రహ్మాపూర్‌ సికింద్రాబాద్‌ జనవరి 9, 16న, నర్సాపూర్‌- సికింద్రాబాద్‌ జనవరి 10న, సికింద్రాబాద్‌- నర్సాపూర్‌ జనవరి 11న నడుస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

Also read: పెళ్లి పీటలు ఎక్కనున్న డెవిల్ ముద్దుగుమ్మ..?

#south-central-railway #special-trains #sankranti
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe