South Central Railway : రైల్వే ప్రయాణీకులకు శుభవార్త... 60 ప్రత్యేక రైళ్లను పొడిగించిన సౌత్‌ సెంట్రల్‌ రైల్వే!

వచ్చే రెండు నెలల కాలంలో రానున్న సెలవులను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే నడుస్తున్న 60 ప్రత్యేక రైళ్లను మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు సౌత్ సెంట్రల్‌ రైల్వే అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు కోరారు.

New Update
Railways: 46 రైళ్ళల్లో 92 కొత్త జనరల్ కోచ్‌లు..రైల్వేశాఖ కీలక నిర్ణయం

South Central Railway Extended Special Trains : సౌత్ సెంట్రల్‌ రైల్వే (South Central Railway) ప్రయాణికులకు ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ప్రస్తుతం వివిధ మార్గాల మధ్య నడుస్తున్న 60 ప్రత్యేక రైళ్లను ఇంకా పొడిగిస్తున్నట్లు వివరించింది.. అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ నెలాఖరు వరకు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. రాబోయే దసరా, దీపావళి, ఛట్‌పూజ నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను (Special Trains) పొడిగిస్తున్నట్లు సౌత్‌ సెంట్రల్ రైల్వే తెలిపింది.

ప్రత్యేక రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే కోరింది. పొడిగించిన రైళ్లలో తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల మధ్య నడిచే రైళ్లు కూడా ఉన్నట్లు తెలిపింది. కాచిగూడ – మధురై , మధురై – కాచిగూడ, కాచిగూడ – నాగర్‌కోయిల్‌ , నాగర్‌కోయిల్‌ – కాచిగూడ , సికింద్రాబాద్‌-రామనాథపురం, రామనాథపురం-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌ – కొల్లం , కొల్లం – సికింద్రాబాద్‌ డిసెంబర్‌ వరకు రాకపోకలు సాగిస్తాయని తెలిపింది.

అలాగే, నర్సాపూర్‌-సికింద్రాబాద్, మచిలీపట్నం – తిరుపతి, సికింద్రాబాద్‌ – అగర్తలా, హైదరాబాద్‌ – జైపూర్‌, హైదరాబాద్ – గోరక్‌పూర్‌, తిరుపతి- షిర్డీ సాయినగర్‌, తిరుపతి-అకోల, అకోల-తిరుపతి,తిరుపతి-కాచిగూడ, సికింద్రాబాద్‌ -దానాపూర్‌, సంత్రాగాచి-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-తిరుపతి, తిరుపతి సికింద్రాబాద్‌, కాకినాడ టౌన్‌ – లింగంపల్లి, లింగంపల్లి-కాకినాడ టౌన్‌, కాచిగూడ – తిరుపతి, షాలిమార్‌ – సికింద్రాబాద్‌, హజ్రత్‌ నిజాముద్దీన్‌ – సికింద్రాబాద్‌ (Secunderabad) తో పాటు పలుమార్గాల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

Also Read: ఆడపడచులకు పవన్‌ పసుపు,కుంకుమ కానుక!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు