భద్రతా పనుల కారణంగా విజయవాడ డివిజన్ లో పలు ట్రైన్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ప్రయాణికులు రైలు ప్రయాణం చేసేవారు ఈ విషయాన్ని గమనించి, మార్పులను చూసుకోని ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు తెలిపారు.
రైల్వే శాఖ రద్దు చేసిన రైళ్ల వివరాలు..కాకినాడ-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ , రాజమండ్రి- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్, మచిలీపట్నం- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్, రైళ్లను నవంబర్ 13 నుంచి నవంబర్ 19 వరకు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే విజయవాడ- విశాఖపట్నం ఉదయ్ ఎక్స్‌ప్రెస్ వనంబంర్ 13,14, 15, 17, 18 తేదీలలో రద్దు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Also read: స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా!
గుంటూరు - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ నవంబర్ 13 నుంచి నవంబర్ 19 వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. మరికొన్ని రైళ్లను వేరే దారిలో నడుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నవంబర్ 13న ఎర్నాకులం నుంచి బయల్దేరే ఎర్నాకులం- పాట్నా ఎక్స్‌ప్రెస్ విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్ , నిడదవోలు జంక్షన్ మీదుగా వెళ్తుంది. బెంగళూరు - గౌహతి ఎక్స్‌ప్రెస్ నవంబర్ 15 నుంచి 17 తేదీలలో బెంగళూరు నుంచి విజయవాడ, గుడివాడ, భీమవరంటౌన్‌నుంచి నిడదవోలు జంక్షన్ మీదుగా బయల్దేరి వెళ్తుంది.
ముంబై -భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు నవంబర్ 13, 15, 17, 18 తేదీలలో ముంబై నుంచి బయల్దేరి విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, మరియు నిడదవోలు జంక్షన్ మీదుగా మళ్లించబడుతుంది. ఈ సమయంలో ఏలూరు, తాడేపల్లిగూడెం స్టేషన్లలో ఆగకుండా వెళ్తుంది.
Also read: నా అల్లుడిని కొట్టారు.. ఐటీ దాడులపై పొంగులేటి సంచలన ఆరోపణలు!