Trains Cancelled: విజయవాడ డివిజన్ లో భారీగా రైళ్లు రద్దు.. వివరాలివే!

విజయవాడ డివిజన్ లో పలు ట్రైన్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ప్రకటించింది.జరిగిన మార్పులతో పాటు పండుగ రద్దీని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు జర్నీ చేయాలని అధికారులు తెలిపారు.

New Update
Trains Cancelled: విజయవాడ డివిజన్ లో భారీగా రైళ్లు రద్దు.. వివరాలివే!

భద్రతా పనుల కారణంగా విజయవాడ డివిజన్ లో పలు ట్రైన్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ప్రకటించింది. ప్రయాణికులు రైలు ప్రయాణం చేసేవారు ఈ విషయాన్ని గమనించి, మార్పులను చూసుకోని ప్రయాణాలను ప్లాన్‌ చేసుకోవాలని రైల్వే అధికారులు తెలిపారు.

రైల్వే శాఖ రద్దు చేసిన రైళ్ల వివరాలు..కాకినాడ-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ , రాజమండ్రి- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌, మచిలీపట్నం- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌, రైళ్లను నవంబర్‌ 13 నుంచి నవంబర్‌ 19 వరకు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే విజయవాడ- విశాఖపట్నం ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ వనంబంర్‌ 13,14, 15, 17, 18 తేదీలలో రద్దు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Also read: స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా!

గుంటూరు - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ నవంబర్‌ 13 నుంచి నవంబర్‌ 19 వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. మరికొన్ని రైళ్లను వేరే దారిలో నడుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నవంబర్‌ 13న ఎర్నాకులం నుంచి బయల్దేరే ఎర్నాకులం- పాట్నా ఎక్స్‌ప్రెస్‌ విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్ , నిడదవోలు జంక్షన్‌ మీదుగా వెళ్తుంది. బెంగళూరు - గౌహతి ఎక్స్‌ప్రెస్‌ నవంబర్ 15 నుంచి 17 తేదీలలో బెంగళూరు నుంచి విజయవాడ, గుడివాడ, భీమవరంటౌన్‌నుంచి నిడదవోలు జంక్షన్‌ మీదుగా బయల్దేరి వెళ్తుంది.

ముంబై -భువనేశ్వర్‌ కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు నవంబర్‌ 13, 15, 17, 18 తేదీలలో ముంబై నుంచి బయల్దేరి విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, మరియు నిడదవోలు జంక్షన్ మీదుగా మళ్లించబడుతుంది. ఈ సమయంలో ఏలూరు, తాడేపల్లిగూడెం స్టేషన్లలో ఆగకుండా వెళ్తుంది.

Also read: నా అల్లుడిని కొట్టారు.. ఐటీ దాడులపై పొంగులేటి సంచలన ఆరోపణలు!

Advertisment
తాజా కథనాలు