హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనం (Hyderabad Ganesh Nimajjanam 2023) ఎంత వైభవంగా జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే. ఓల్డ్ సిటీ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఘనంగా కొనసాగే మహాశోభయాత్రను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివస్తుంటారు. అయితే.. శోభయాత్ర జరిగే ప్రాంతంలో ట్రాఫిక్ ను మళ్లిస్తారు పోలీసులు. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ వద్ద జరిగే గణేశ్ నిమజ్జన వేడుకను చూడడానికి వెళ్లడం ఇబ్బందిగా మారుతుంది. ఈ నేపథ్యంలో భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఎంఎంటీఎస్ స్పెషల్ సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 28వ తేదీ రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 4 గంటల వరకు ఈ స్పెషల్ సర్వీసులు నడపనున్నారు. ఆ ఎంఎంటీఎస్ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Train No.GSH-5: హైదరాబాద్-లింగంపల్లి ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్ ఈ నెల 28న రాత్రి 11 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 23.50 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.
Train No.GSH-1: సికింద్రాబాద్-హైదరాబాద్ ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్ ఈ నెల 28వ తేదీ రాత్రి 11.50 గంటలకు సికింద్రాబాద్ లో బయలుదేరి.. మరుసటి రోజు 00:20 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటుంది.
Train No.GLF-6: లింగంపల్లి-ఫలక్ నూమా ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్ఈ నెల 29న ఉదయం 12.10 గంటలకు లింగంపల్లి నుంచి బయలుదేరి.. 01:50 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.
Train No.GHL-2: హైదరాబాద్-లింగంపల్లి ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 29న ఉదయం 12:30 గంటలకు బయలుదేరి.. 01:20 గంటలకు లింగంపల్లికి చేరుకుంటుంది.
Train No.GLH-3: లింగంపల్లి-హైదరాబాద్ ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్ ఈ నెల 29న ఉదయం 01:50 గంటలకు బయలుదేరి.. 02:00 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.
Train No.GFS-7: ఫలక్ నూమా-సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్ ఈ నెల 29న 02:20 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 03:30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.
Train No.GHS-4: హైదరాబాద్-సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 29న నడపనుంది దక్షిన మధ్య రైల్వే. ఈ స్పెషల్ ఎంఎంటీఎస్ ట్రైన్ 03:30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 04:00 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది.
Train No.GSH-8: సికింద్రాబాద్-హైదరాబాద్ ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 29న నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ 04:00 గంటలకు సికింద్రాబాద్ లో బయలుదేరి.. 4:40 గంటలకు హైదరాబాద్ కు చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
ఇది కూడా చదవండి: Ganesh Nimajjanam 2023: గణేశ్ నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు