Sankranti Special Trains: దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా కీలక ప్రకటన చేసింది. సంక్రాంతి (Sankranti) నేపథ్యంలో మరో 4 స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. సికింద్రాబాద్-నరసాపూర్, నరసాపూర్-హైదరాబాద్, హైదరాబాద్-శ్రీకాకుళం రోడ్, శ్రీకాకుళం రోడ్-హైదరాబాద్ మధ్య ఈ స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే.
Train No.07176: సికింద్రాబాద్-నరసాపూర్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 31న నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ ఆ రోజు రాత్రి 10.5 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 07:10 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. ఈ ట్రైన్ కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, రాయనపాడు, రామవరప్పాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతుంది.
ఇది కూడా చదవండి: Hero Prabhas: నరసాపురం బరిలో ప్రభాస్ పెద్దమ్మ.. ఏ పార్టీ నుంచో తెలుసా?
Train No.07177: నర్సాపూర్-హైదరాబాద్ స్పెషల్ ట్రైన్ ఈ నెల 14న సాయంత్రం 6 గంటలకు నరసాపూర్ లో బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 04:50 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. ఈ ట్రైన్ పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ స్టేషన్లలో ఆగుతుందని ప్రకటనలో పేర్కొన్నారు.
Train No.07178: సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్ ట్రైన్ ఈ నెల 12న రాత్రి 09:10 గంటలకు హైదరాబాద్ లో బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 11.45 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుంది.
Train No.07179: శ్రీకాకుళం రోడ్-హైదరాబాద్ ట్రైన్ ను ఈ నెల 13న నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ ఆరోజు సాయంత్రం 05.30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 09:15 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.
- ఈ రెండు ట్రైన్లు సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, రాయనపాడు, ఏలూరు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో ఆగుతాయని ప్రకటనలో పేర్కొన్నారు.
- ఇంకా ఈ రైళ్లలో ఫస్ట్ ఏసీ, 2 ఏసీ, 3 ఏసీ స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.