IND vs SA: ఫ్యాన్స్ కు నిరాశ.. సౌతాఫ్రికాతో తొలి టీ 20 వర్షార్పణం

మూడు టీ20 (T20I) మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో డర్బన్‌ వేదికగా భారత్‌ తలపడాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయ్యింది. మ్యాచ్ ప్రారంభానికి నిర్దేశిత సమయం కన్నా ముందు నుంచే వర్షం కొనసాగుతుండడంతో టాస్‌ కూడా పడకుండానే రద్దు చేశారు. 

New Update
IND vs SA: ఫ్యాన్స్ కు నిరాశ.. సౌతాఫ్రికాతో తొలి టీ 20 వర్షార్పణం

IND vs SA: మూడు టీ20 (T20I) మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో డర్బన్‌ వేదికగా భారత్‌ తలపడాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయ్యింది. మ్యాచ్ ప్రారంభానికి నిర్దేశిత సమయం కన్నా ముందు నుంచే వర్షం కొనసాగుతుండడంతో టాస్‌ కూడా పడకుండానే రద్దు చేశారు.

ఇది కూడా చదవండి: ENG W vs IND W: గెలిచిన భారత్.. ఇంగ్లండ్ దే సిరీస్

ఓవర్లు కుదించి మ్యాచ్‌ నిర్వహించాలని భావించినప్పటికీ లాభం లేకపోయింది. ఎంతసేపటికీ వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. రెండో టీ20 కెబెరాలోని సెయింట్ జార్జ్ పార్క్ స్టేడియంలో మంగళవారం జరగనుంది.

ప్రపంచకప్ కోల్పోయిన సౌతాఫ్రికా జట్టు ఈ సిరీస్ ను ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది. మరోవైపు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ లో విజయంతో ఊపు మీదున్న భారత జట్టు సౌతాఫ్రికాతో సిరీస్ ను కూడా స్వీప్ చేయాలన్న ఉత్సాహంతో ఉంది. తొలి టీ20లో నువ్వా నేనా అన్నట్లు తలపడడానికి రెండు జట్లూ సిద్ధమవగా, మ్యాచ్ వర్షం పాలైంది. దీంతో రెండో టీ20లో విజయం సాధించడం రెండు జట్లకూ మరింత కీలకంగా మారింది.

Advertisment
తాజా కథనాలు