Cash Deposit : ప్రస్తుతం లావాదేవీలు(Transactions) మొత్తం యూపీఐ(UPI)(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ద్వారానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు(Banks) ల్లో కూడా యూపీఐ ద్వారా నగదు డిపాజిట్ చేసే సదుపాయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం బ్యాంకుకు వెళ్లి వివరాలు నింపి బ్యాంకు అధికారికి డబ్బులు ఇవ్వడం, అలాగే డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే ఈ అవకాశం ఉంది. కానీ ఇప్పుడు యూపీఐకి పెరుగుతున్న ఆదరణతో పాటు ఏటీఎంల వద్ద కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణకు యూపీఐ సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం వల్ల వచ్చే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని.. నగదు డిపాజిట్ చేయడాన్ని కూడా యూపీఐ ద్వారా చేసే సదుపాయాన్ని తేవాలని ప్రతిపాదించినట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
వీటికి సంబంధించి మార్గదర్శకాలను కూడా త్వరలోనే జారీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే థర్డ్ పార్టీ యూపీఐ అప్లికేషన్ల ద్వారా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రూమెంట్స్ అనుసంధానికి కూడా పర్మిషన్ ఇవ్వాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. అలాగే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల(NBFC) వ్యవస్థ అంతటా కూడా ఎలాంటి సమస్య లేదని ఆర్‌బీఐ గవర్నర్ పేర్కొన్నారు. ఇటీవల ఆర్బీఐ.. వ్యాపారంలో అవకతవకల వల్ల రెండు ఎన్‌బీఎస్‌సీలపై చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. అందుకే శక్తికాంత దాస్ దీనిపై ఇలా వివరణ ఇచ్చారు.
Also Read: భార్య పదేపదే అలా చేయడం తప్పే!
ప్రస్తుతం ఆర్థిక ఏడాదికి(2024-25) వృద్ధి రేటు అంచనాలో కూడా ఎలాంటి మార్పు చేయకుండా 7 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. సాధారణ వర్షపాతం అంచనాలు, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు తగ్గడం లాంటి వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంది. 2024-25 మొదటి త్రైమాసికంలో Q1లో 7.1%, Q2లో 6.9%, Q3లో 7%, Q4లో 7 శాతం వృద్ధి రేటును ఆర్‌బీఐ అంచనా వేసింది. ఆహార పదార్థాల ధరల అనిశ్చితుల ప్రభావం ద్రవోల్యణం అంచనాలపై కొనసాగుతున్నప్పటికీ కూడా.. ప్రస్తుతం ఆర్థిక ఏడాదికి ద్రవ్యోల్బణ అంచనాను 4.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది ఆర్బీఐ.
ఇదిలాఉండగా.. ప్రభుత్వ సెక్యూరిటీస్ (జి - సెక్యూరిటీస్) లేదా ప్రభుత్వ బాండ్ల మార్కెట్లలో రిటైల్ మదుపర్లు కూడా పాల్గొనేలా వీలు కల్పించేందుకు ఒక మొబైల్ యాప్‌ను త్వరలోనే ఆర్‌బీఐ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ యాప్ ద్వారా బాండ్ల కొనుగోలు, విక్రయాలు చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్(ఐఎఫ్‌ఎస్‌సీ)లో సార్వభౌమ హరిత బాండ్ల (సావరిన్ గ్రీన్ బ్రాండ్లు) ట్రేడింగ్‌కు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది.
Also Read: వరుస భూకంపాలతో వణికిపోతున్న జమ్మూ..24 గంటల్లో అతలాకుతలం
అలాగే పసిడి నిల్వలను కూడా భారత్ మరితంగా పెంచుకోనుందని.. ఆర్‌బీఐ పేర్కొంది. అధికారుల గణాంకాల ప్రకారం చూసుకుంటే.. 2024 మార్చి 22 నాటికి విదేశీ మారకపు నిల్వల్లో.. బంగారం నిల్వ 51.487 డాలర్లుగా ఉంది. 2023 మార్చి చివరినాటితో పోలిస్తే.. ఈ విలువ 6.28 బిలియన్ డాలర్లు ఎక్కువ. ఇంకోవైపు 2023-24లో పలు అభివృద్ధి చెందిన దేశాలు, ఇతర వర్ధమాన దేశాల కరెన్సీలతే పోల్చి చూస్తే.. భారత కరెన్సీ రూపాయి చాలావరకు ఓ శ్రేణికి లోబడే ఉందని.. ప్రధాన కరెన్సీలతో పోసిస్తే రూపాయి విలువ అత్యంత స్థిరత్వాన్ని ప్రదర్శించినట్లు ఆర్బీఐ పేర్కొంది.