మీ విజయం స్ఫూర్తిదాయకం: భారత జట్టుకు సోనియాగాంధీ ప్రశంస

వరల్డ్ కప్ ఫైనల్ దాకా భారత క్రికెట్ జట్టు కొనసాగించిన విజయపరంపర సమష్టి కృషి, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించిందని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. టీమిండియా క్రికెట్ కు అతీతమైన ఆదర్శ స్ఫూర్తిని ప్రదర్శించిందని కొనియాడారు.

New Update
మీ విజయం స్ఫూర్తిదాయకం: భారత జట్టుకు సోనియాగాంధీ ప్రశంస

Soniya Gandhi: వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు ప్రవేశించిన భారత క్రికెట్‌ జట్టును కాంగ్రెస్‌ నాయకురాలు సోనియాగాంధీ అభినందించారు. "అప్రతిహతమైన ప్రదర్శనతో, సమష్టి కృషితో కొనసాగిన టీమిండియా విజయాల పరంపర అందరికీ స్ఫూర్తిదాయకం. ఐక్యత, కృషి, పట్టుదల, సంకల్పం, అచంచలమైన ఆత్మవిశ్వాసం వంటి క్రికెట్‌కు అతీతమైన ఆదర్శాలను భారత జట్టు ప్రదర్శించింది. వారి ఆటతీరు దేశ ప్రతిష్ఠను పెంచింది" అని శనివారం రాత్రి ట్వీట్‌ చేసిన వీడియో సందేశంలో సోనియా వ్యాఖ్యానించారు. గతంలో రెండు సార్లు 1983, 2011లో భారత్‌ వరల్డ్‌కప్‌ విజేతగా నిలిచిన సందర్భాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

Advertisment
తాజా కథనాలు