Sonia Gandhi: సోనియా గాంధీ కీలక సమావేశం.. ఎంపీల సస్పెన్షన్.. తెలంగాణలో పోటీపై చర్చ? పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమేటరీ పార్టీ సమావేశం కానుంది. ఎంపీలపై సస్పెన్షన్ వేటు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. By V.J Reddy 20 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MP's Suspension From Parliament: పార్లమెంట్ ను సభ్యుల సస్పెషన్ వ్యవహారం కుదిపేస్తోంది. పార్లమెంట్ నుంచి రికార్డు స్థాయిలో ఎంపీల సస్పెన్షన్. నిన్న (మంగళవారం) ఉభయసభల నుంచి 92 మంది విపక్ష ఎంపీలు సస్పెండ్ అయ్యారు. మొత్తం 141 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో విపక్ష ఎంపీలు అందరు దేశంలో ప్రజాస్వామ్యం కూని అయిందని పార్లమెంట్ ముందు ధర్నాకు దిగారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే బీజేపీ ఇలా వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు. దేశ చరిత్రలో ఒకసారి ఇంతమంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పాడడం ఇదే తొలిసారి. ALSO READ: రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. నేడే అకౌంట్లోకి డబ్బులు జమ! సోనియా గాంధీ కీలక భేటీ.. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమేటరీ పార్టీ సమావేశం కానుంది. ఎంపీలపై సస్పెన్షన్ వేటు, ఇతర అంశాలపై చర్చిననున్నారు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని కేంద్రం అపహాస్యం చేస్తుందని మండిపడ్డారు. పార్లమెంట్ లో చట్టబద్దమైన డిమాండ్ ను లేవనెత్తేందుకు సిద్ధమవ్వాలని ఆమె తెలిపారు. పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేశారని ఫైర్ అయ్యారు. CPP chairperson Sonia Gandhi speaks in the Congress Parliamentary Party meeting at Central Hall of Sanvidhan Sadan, Parliament House "Democracy has been strangulated by this government. Never before have so many Opposition Members of Parliament been suspended from the house,… pic.twitter.com/yCtHi18JOg — ANI (@ANI) December 20, 2023 ALSO READ: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మాస్కు తప్పనిసరి! తెలంగాణలో ఎంపీగా సోనియా గాంధీ పోటీ? రాబోయే లోక్ సభ ఎన్నికల్లో సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సైతం రాష్ట్రంలోని ఏదో ఒక పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారట. ఈ మేరకు సోమవారం గాంధీభవన్ లో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించారు. కీలక నేతల అభిప్రాయాలను సేకరించి సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని ఫిక్స్ అయ్యారని గాంధీ భవన్ లో టాక్ నడుస్తోంది. పీఏసీ నేతల అభిప్రాయాలతో తీర్మానం సైతం చేశారట. రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండగా ఖమ్మం, నల్లగొండ సెగ్మెంట్లలో కాంగ్రెస్ తప్పనిసరిగా గెలుస్తుందని ఆ పార్టీ ఇంటర్నల్ గా నిర్వహించిన సర్వే రిపోర్టులో తేలింది. దీంతో ఈ రెండు సెగ్మెంట్ల పరిధిలో సోనియాను పోటీ చేయించేందుకు నేతలు సిద్దమవుతున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. #sonia-gandhi #telugu-latest-news #parliament-elections #mps-suspension మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి