Pregnent rumours: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ప్రెగ్నెన్సీ రూమర్స్ పై స్పందించింది. ఇటీవలే మ్యారేజ్ చేసుకున్న ఆమె.. కొన్ని రోజుల వ్యవధిలోనే గర్భం దాల్చిందంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. దీంతో రీసెంట్ గా ఓ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న నటి.. పెళ్లి తర్వాత తన లైఫ్ లో వచ్చిన మార్పుల గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది.
‘పెళ్లికి ముందు లాగే ఇప్పుడు కూడా సంతోషంగా ఉన్నా. లైఫ్ ఇంతకంటే అందంగా, గొప్పగా ఉండదేమో అనిపిస్తోంది. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నా. మళ్లీ నా సినిమా షూటింగ్ లో పాల్గొనడం సంతోషంగా ఉంది. పెళ్లి తర్వాత వచ్చిన ఒకే ఒక్క మార్పు ఏమిటంటే.. ఇకపై మేము హాస్పిటల్‌కు వెళ్లాలనుకోవడం లేదు. ఎందుకంటే మేము అక్కడ కనిపిస్తే చాలు ప్రెగ్నెంట్ అంటూ జనాలు హంగామా చేస్తున్నారు. అందరూ అదే ఆలోచిస్తున్నారు' అంటూ చెప్పుకొచ్చింది.
అసలేం జరిగిదంటే.. సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా ఇటీవల ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. దీంతో ఆయనకోసం సోనాక్షి అక్కడకు వెళ్లడంతో రూమర్స్ మొదలయ్యాయి. సోనాక్షి సిన్హా- జహీర్ ఇక్బాల్ జూన్ 23న వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లిపై వచ్చిన ట్రోలింగ్‌ను కూడా సోనాక్షి తిప్పికొట్టారు.