Indira Gandhi Assassination: లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ హంతకుడి కొడుకు పోటీ..

భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని హత్య చేసిన బియాంత్ సింగ్ కొడుకు సరబ్‌జిత్ సింగ్ ఖల్సా(45) లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌ నియోజకవర్గం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు.

New Update
Indira Gandhi Assassination: లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ హంతకుడి కొడుకు పోటీ..

Beant Singh's Son Contesting in Elections: భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని హత్య (Assassination of Indira Gandhi) చేసిన దోషి కుమారుడు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌ నియోజకవర్గం నుంచి సరబ్‌జిత్‌ సింగ్‌ ఖల్సా (45) స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. 1984లో ఇందిరాగాంధీని హత్య చేసిన హంతకుల్లో ఒకడైన బియాంత్ సింగ్ కొడుకే ఈ సరబ్‌జిత్ సింగ్ ఖల్సా (Sarabjit Singh Khalsa). అయితే ఈ ఎన్నికల ఆయనకు మొదటిసారి కాదు. గతంలో కూడా సరబ్‌జిత్‌ వివిధ ఎన్నికల్లో పోటీ చేశారు. 2004లో బఠిండా స్థానం నుంచి పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. 2007లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భదౌర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

Also Read: ఇంట్లో దొంగలు పడ్డారని చెప్పిన యువతి.. తీరాచూస్తే షాక్

2009, 2014 పార్లమెంటు ఎన్నికల్లో కూడా బఠింఢా, ఫతేగడ్‌ సాహిబ్‌ స్థానాల నుంచి బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో తనకు రూ.3.5 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. ఇక సరబ్‌జీత్‌ తల్లీ బిమల్‌ కౌర్ ఖల్సా.. 1989 లోక్‌సభ ఎన్నికల్లో రోవర్‌ స్థానంలో పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఆ ఎన్నికల్లోనే ఆయన తాత సుచాసింగ్ కూడా బఠిండా నుంచి పోటీ చేసి గెలుపొందారు.

అయితే ఇప్పుడు సరబ్‌జీత్‌ పోటీ చేస్తున్న ఫరీద్‌కోట్ స్థానానికి కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ సాదిఖ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఢిల్లీకి చెందిన సిట్టింగ్ ఎంపీ, సినీ గాయకుడు హన్స్‌రాజ్‌ హన్స్‌ పోటీ చేస్తున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి.. ప్రముఖ కమెడియన్ కరంజిత్ అనుమోల్‌ బరిలోకి దిగనున్నారు. ఇదిలాఉండగా.. 1984 అక్టోబర్‌ 31న అప్పటి దేశ ప్రధాని ఇందిరాగాంధీని ఆమె భద్రతా సిబ్బంది బియాంత్ సింగ్, సత్వంత్‌ సింగ్ తుపాకులతో కాల్చడంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Also Read: రూ.లక్ష కోట్ల స్కామ్.. మహిళా వ్యాపారికి మరణశిక్ష..

Advertisment
తాజా కథనాలు