/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/3754243284_21ef801fe0_b-jpg.webp)
Firing In Mancherial: మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సాలిగామలో కాల్పుల కలకలం రేపాయి. అత్తారింట్లో అల్లుడు నరేందర్ కాల్పులు జరిపాడు. ఆస్తి కోసం అత్తమామలపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అత్తామామలపై ఫైరింగ్ చేయగా.. బులెట్లు గోడలకు తగిలి తృటిలో ప్రమాదం తప్పింది. నిందితుడు నరేందర్ అత్తామామలపై మొత్తం రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. కాల్పుల శబ్దం విన్న స్థానికులు భయభ్రాంతులకు గురైయ్యారు. ప్రస్తుతం నరేందర్ పరారిలో ఉన్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. నరేందర్ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులకు తెలిపారు అతని అత్తామామలు. అయితే.. నరేందర్ చేతికి గన్ ఎలా వచ్చిందనే అంశంపై పోలీసుల విచారణ చేపడుతున్నారు. ఈ కేసును సీరియస్ తీసుకున్నారు మంచిర్యాల జిల్లా ఏసీపీ రవి కుమార్. భవిష్యత్ లో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.