Terrorist Attack in Somalia: సోమాలియాలో మళ్లీ ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. వీకెండ్ సందర్భంగా ఉల్లాసంగా గడిపేందుకు వచ్చిన పౌరులపై కాల్పులు జరిపారు. రాజధాని మొగదీషులో ఉన్న ఓ బీచ్ హోటల్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. ఈ దుర్ఘటనలో 32 మంది మృతి చెందారు. మరో 63 మంది గాయాలపాలయ్యారు.
Also Read: కొండపై చిక్కుకున్న కుటుంబం.. ప్రాణాలకు తెగించి కాపాడిన రెస్క్యూ టీం
ఇక వివరాల్లోకి వెళ్తే.. ముందుగా మొగదీషులోని లిడో బీచ్ హోటల్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఉగ్రవాదుల్లో ఒకడు తనుకు తానే పేల్చుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. దీంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మృతుల్లో ఒక సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది ముగ్గురు ఉగ్రవాదులను హతం చేశారు. మరో దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు పేలుడు ధాటికి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ దాడికి పాల్పడింది తామేనని అల్‌ఖైదాతో సంబంధాలున్న అల్ షబాబ్ ఉగ్ర సంస్థ ప్రకటించింది. ఇటీవల కాలంలో సోమాలియాలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదేనని పోలీసులు తెలిపారు.
Also Read: ఇద్దరు ఒకేలా.. క్రీడా లోకాన్ని అబ్బురపరిచిన చైనీస్ ద్వయం: వీడియో వైరల్