Constipation: మలబద్ధకం సమస్య ఇప్పుడు అందరికిని వేధిస్తున్న సమస్య. చాలా మంది ప్రజలు ప్రయాణంలో కూడా మలబద్ధకం గురించి ఫిర్యాదు చేస్తారు. ఈ సమస్య బయట తినడం వల్ల ఇది మరింత పెరుగుతుంది. ప్రేగు కదలికలు సరిగా జరగవు. ఈ రోజుల్లో.. కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి కొందరూ బయటకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. విదేశీ ఆహార పదార్థాల తినటం వలన మలబద్ధకం సమస్య ఎక్కువ అవుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఇలా సమయంలో మానసిక స్థితి చికాకుగా ఉంటుంది. ఉబ్బిన కడుపు, ఉబ్బరం, అజీర్, గ్యాస్ సమస్యల వల్ల కొంత ఇబ్బంది పడుతారు. పోషకాహార నిపుణుడు మలబద్ధకం నుంచి బయటపడటానికి కొన్ని సహజ నివారణలు తెలుసుకున్నారు. వాటి వలన ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
మలబద్ధకాన్ని నివారించే ఆహార పదార్థాలు
పొడి రేగు పండ్లు: మలబద్ధకం సమస్య ఉంటే విహారయాత్రకు వెళ్తున్నప్పుడు ఎండిన రేగు పండ్లను వెంట తీసుకేళ్లండి. ఎండిన రేగులో ఫైబర్, సార్బిటాల్ అధికంగా ఉంటాయి. ఇవి సహజంగా మలాన్ని మృదువుగా చేస్తాయి. ఇవి పొట్టకు చాలా ఆరోగ్యకరమని చెబుతున్నారు.
నీరు తాగాలి: రోజూ నీరు త్రాగడం వలన ఫైబర్ మంచిగా పని చేస్తుంది. అంతేకాదు ఇది జీర్ణక్రియను సాఫీగా ఉంచి..జీర్ణవ్యవస్థ సక్రమంగా చక్కగా ఉంటుంది. ప్రయాణ సమయంలో 3 లీటర్ల నీరు త్రాగితే శరీరం డీహైడ్రేషన్ బారిన పడదు.
పిజ్జా-పాస్తాలో కూరగాయలు: జంక్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ప్రయాణంలో పిజ్జా, జంక్ ఫుడ్స్, పాస్తా వంటివి తింటారు. మలబద్ధకం సమస్య ఉంటే..వెజిటబుల్ పిజ్, పాస్తా తినటం మంచిది. ఇది కడుపు, ప్రేగులలోని కండరాలను చురుకుగా ఉంచుతుంది.
మద్యం: ప్రయాణాల్లో చాలామంది మద్యం సేవిస్తారు. దీనిని మానుకుంటే మంచిది. ఇది మలబద్ధకం సమస్య పెరుగుతుంది.వీలైనంత వరకు ధూమపానం, మద్యపానం ప్రయాణంలో మానుకుంటే సమస్యను తగ్గించుకోవచ్చు.
పండ్లు: పీచు పదార్థాలు ఉండే పండ్లను ఎక్కువగా తింటే బెస్ట్. ఫైబర్ కడుపులోకి వెళ్లి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. పీచు అధికంగా ఉండే సిట్రస్ ఫ్రూట్స్ కివీ, ఆరెంజ్, జామ, యాపిల్, లెమన్, డ్రాగన్ ఫ్రూట్, మామిడి, అరటిపండు, అవకాడో మొదలైన వాటిని తీసుకుంటే మంచిది
ఇది కూడా చదవండి: అమ్మాయిల కన్నీళ్లకు ఇంత పవరా? కన్నీళ్లను వాసన చూస్తే ఇలా ఉంటది మరి..!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.