Adithi Bharadwaj Suicide - Hyderabad: 15 రోజుల్లో పెళ్లి.. అంతలోనే పెళ్లి కూతురు సూసైడ్ చేసుకుంది. అప్పటివరకు ఇష్టపడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకుంటా అనే ఆనందంలో ఉన్న ఆమె.. సడెన్ గా అలా సూసైడ్ చేసుకోవడం అందరిని షాక్ కి గురి చేసింది. అసలు సడెన్ గా ఆమెకు ఏం జరిగింది.. ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంది.. ఇప్పుడు అందరికి వస్తున్న డౌట్ ఇదే..
బీహార్ కు చెందిన అదితి భరద్వాజ్(Adithi Bharadwaj) కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్(Software Engineer) గా పనిచేస్తూ ఇక్కడే స్థిరపడింది. ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని.. కొద్దిరోజులకే విడాకులు తీసుకుంది. ప్రస్తుతం మణికొండలో ఉంటున్న ఆమె .. తనతో పనిచేసే మహ్మద్‌అలీతో గతకొంతకాలంగా సహజీవనం చేస్తోంది.
అయితే, అత్తాపూర్ లోని హ్యాపీహోమ్స్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ తీసుకుని అదితీని అందులో ఉంచాడు. ఇక వచ్చే నెల 12 న పెళ్లి చేసుకోవాలని ఇద్దరు డిసైడ్ అయ్యారు. ఇంతలో ఆమె ఇంట్లో ఉరివేసుకుని.. సూసైడ్ చేసుకుంది. అయితే, రెండ్రోజుల క్రితం ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైందని.. హాస్పిటల్ కి వెళ్లగా ఆమె ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పారు.
ఆమె వెంటనే.. మహ్మద్‌అలీకి ఫోన్ చేసి తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు చెప్పింది. అతడు ఫ్లాట్‌కు చేరుకునేసరికే అదితి ఫ్యాన్‌కు ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. వెంటనే మహ్మద్‌అలీ అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: పక్క రాష్ట్రాల్లో కాపురాలు..ప్రగల్భాలు ఇక్కడ..షర్మిల పై విరుచుకుపడ్డ రోజా!