హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని రాజేంద్రనగర్ సమీపంలోని అత్తాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రామచంద్ర రావు ఆత్మహత్య చేసుకున్నాడు. అత్తాపూర్‌లోని మారుతీ నగర్‌లో తాను ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో యువకుడు ఫ్యాన్‌కు ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.
“నేను నా తల్లిదండ్రులకు, నా కుటుంబ సభ్యులకు గానీ ఏమీ చేయలేకపోతున్నానని, నేను తీసుకున్న పర్సనల్ లోన్లను కట్టలేకపోతున్నానని,నేను చనిపోతున్నాను నా బాడీలోని భాగాలను ఎవరికైనా దానం చేయండి. తల్లిదండ్రులుకు భారంగా మారకూడదనే ఈ పని చేస్తున్నట్లు ఉద్యోగి తెలిపాడు”. కాగా పోలీసుల సమాచారంతో అత్తాపూర్ చేరుకున్న మృతుడి కుటుంబ సభ్యులు కుమారుడు విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి బోరున విలపించారు.
యువకుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతుడి సెల్ ఫొన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగి ఆకరి కోరికగా తన బాడిలోని అవయవాలు ఎవరికైనా ఇవ్వవాలని తల్లిదండ్రులకు పోలీసులు తెలిపారు. కాగా యువకుడిని ఎవరైనా వేధిస్తున్నారా.? లోన్ ఏజెంట్లు కాల్స్ చేస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతే కాకుండా కుటుంబ సభ్యులు కుమారున్ని మందలించారా.? అనే కోణంలో సైతం విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.