/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-60-1-jpg.webp)
AP : టాలీవుడ్ కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ramgopal varma), నటుడు నాగేంద్రబాబు (Nagendrababu) మధ్య మరోసారి సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఆర్జీవీ తల నరికితే కోటి రూపాయలు ఇస్తానంటూ అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు (Srinivas) కాంట్రవర్సీ కామెంట్స్ దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. కాగా దీంతో ఎవరైన తనపై దాడి చేస్తారని, ప్రాణహాని ఉందంటూ వర్మ పోలిస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ ఇష్యూలోకి తాజాగా మెగా బ్రదర్ నాగబాబు ఎంటర్ అయ్యారు. ఒక దర్శకుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పుగా భావిస్తున్నానని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ నాగబాబు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.
సార్ నా కన్నా పెద్ద కమెడియన్ ఎవడంటే , నా సినిమాలో మీరు 🤣🤣🤣 మీ తమ్ముడి దగ్గర డబ్బులడుక్కుని టీ తాగి పడుకోండి 😎😎😎 pic.twitter.com/RbhusBDNvf
— Ram Gopal Varma (@RGVzoomin) December 27, 2023
'ఆర్జీవీగారు మీరేం భయపడకండి. మీ జీవితానికి ఏ డోఖా లేదు. మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోనే ఇండియాలోనూ ఏ పనికిమాలిన వెదవ మీకెటువంటి హాని తలపెట్టడు. ఎందుకంటే హీరో విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్ గాడిని ఎవడు చంపడు కదా.. సో మీరేం వర్రీ అవకండి. కాబట్టి నిశ్చింతగా, నిర్భయంగా ఓ ఓడ్కా పెగ్గేసి పడుకోండి. ఎల్లపుడు మీ మంచి కోరే మీ శ్రేయోభిలాషి నాగబాబు' అంటూ పరోక్షంగా కౌంటర్లు వేశారు.
Here’s the complaint I gave on Kolikapudi Sreenivasa rao , Tv 5 anchor Sambashiva rao and B R Naidu the channel owner
To
the డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్
ఆంధ్ర ప్రదేశ్
గౌరవనీయులైన డి.జి గారికి
టీడీపీ పార్టీకి సంబంధించిన కోలికపూడి శ్రీనివాసరావు, టీవీ 5 ఛానల్ యాంకర్…
— Ram Gopal Varma (@RGVzoomin) December 27, 2023
ఇది కూడా చదవండి : TS RTC : ఆర్టీసీ సిబ్బందిపై ఆటో డ్రైవర్లు దాడి.. నీళ్లు చల్లి బూతులు తిడుతూ
అయితే నాగబాబు కౌంటర్ పై వెంటనే తనదైన స్టైల్ లో రియాక్ట్ అయిన రామ్ గోపాల్ వర్మ.. 'సార్ నా కన్నా పెద్ద కమెడియన్ ఎవడంటే.. నా సినిమాలో మీరు, మీ తమ్ముడి దగ్గర డబ్బులడుక్కుని టీ తాగి పడుకోండి' అంటూ సెటైర్లు వేశారు. ప్రస్తుతం వీరిద్దరి వార్ కు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇరువురి ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
నివారిస్తున్నట్టు నటిస్తూనే ఆ కొలికపూడి శ్రీనివాసరావు తో నన్ను చంపించటానికి మూడు సార్లు కాంట్రక్ట్ ఇప్పించావుగా సాంబా ..జస్ట్ వెయిట్ pic.twitter.com/3eMyfRGcM1
— Ram Gopal Varma (@RGVzoomin) December 26, 2023