Rs. 500 Note: రూ. 500 నోటు పై రాముడి ఫోటో.. ఆర్బీఐ రిలీజ్..నిజమేనా? అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠకి ఏర్పాట్లన్ని చురుగ్గా జరుగుతున్న సమయంలో రాముని బొమ్మతో ఆర్బీఐ 500 రూపాయల నోటును విడుదల చేస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. అయితే అది ఫేక్ న్యూస్ అని బ్యాంకింగ్ రంగ నిపుణుడు అశ్వనీ రాణా వివరించారు. By Bhavana 17 Jan 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి Rs. 500 Note: దేశ వ్యాప్తంగా అయోధ్య (Ayodhya) రామ మందిర ప్రారంభోత్సవం కోసం ఎదురు చూస్తున్న సమయంలో జనవరి 22 నే శ్రీరాముని చిత్రాలతో ఉన్న రూ. 500 నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) విడుదల చేయబోతుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం, శ్రీరాముని చిత్రాలతో పాటు రూ. 500 నోటు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖలందరికీ ఆహ్వానాలు.. జనవరి 22 ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులంతా కూడా రామ నామ స్మరణలో మునిగిపోయారు. దేశం మొత్తం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇప్పటికే రామ మందిర ప్రారంభోత్సవానికి రావాలని దేశంలోని చాలా మంది ప్రముఖలందరికీ ఆహ్వానాలు అందాయి. NEW 500 NOTES WILL BE ISSUED ON 22/01/2024நிஜமா? 🤔🤔🤔🤔 pic.twitter.com/peiCwlr9oZ— 😇 ✍lαthα αѕhσkrαj🪷 🇮🇳 (@TenthPlanet1) January 16, 2024 గాంధీ బొమ్మ ఉన్న చోట రాముని బొమ్మ... ఈ క్రమంలోనే రూ. 500 నోటు పై రాముని చిత్రం అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. ఈ నోటు పై మహాత్మ గాంధీ బొమ్మ ఉన్న చోట రాముని బొమ్మ...ఎర్ర కోట ఫోటో ఉన్న చోట రామ మందిరం నిర్మిస్తున్న ఫోటో ఉంది. అయితే ఆర్బీఐ దీని గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాముని బొమ్మ ఉన్న నోటు నకిలీదని బ్యాంకింగ్ రంగ నిపుణుడు, వాయిస్ ఆఫ్ బ్యాంకింగ్ వ్యవస్థపాకుడు అశ్వనీ రాణా వివరించారు. ఆర్బీఐ ఎటువంటి సమాచారం ఇవ్వలేదని ఇదంతా కూడా ఫేక్ న్యూస్ అని తెలిపారు. Also read: హానీమూన్ కి ఆలస్యం అవుతుందనే పైలట్ పై దాడి చేసిన ప్రయాణికుడు! #ayodhya #rbi #fake #ram-mandir #500-note మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి