BCCI : శ్రీలంక (Srilanka) పర్యటనకు వెళ్లే భారత జట్టు (Team India) ను బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం టీమ్ ఇండియా మరికొద్ది రోజుల్లో లంకకు వెళ్లనుంది. టీ20 సిరీస్‌తో ఈ టూర్ ప్రారంభం కానుంది. ఈ టూర్ కోసం కొత్త కెప్టెన్‌గా ఎంపికైన సూర్యకుమార్ యాదవ్‌కు ఈ పర్యటన చాలా కీలకం కానుంది.
Surya Kumar Yadav : టీ20 ప్రపంచకప్‌ను భారత్‌కు అందించిన రోహిత్ శర్మ (Rohit Sharma) స్థానాన్ని భర్తీ చేయడం సూర్యకి అంత తేలికైన విషయం కాదు. దాంతో పాటు టీ20 కెప్టెన్సీ రేసులో ఉన్న ఇతర ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ జట్టును నడిపించాల్సిన గురుతర బాధ్యత సూర్యపై ఉంది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా సూర్య తన లంక పర్యటనలో మూడు కఠినమైన సవాళ్లను ఎదుర్కోబోతున్నాడు.
Surya Kumar Yadav 33 ఏళ్ల సూర్యకుమార్‌కు పెద్ద టోర్నీల్లో జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం లేకపోవడం కెప్టెన్‌గా అతనికి ఉన్న మొదటి సవాలు. సూర్య ఇప్పటి వరకు కేవలం 7 టీ20 మ్యాచ్‌లకు మాత్రమే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో ఐదు మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. సూర్య నాయకత్వంలో ఆ జట్టు ఆస్ట్రేలియాను స్వదేశంలో జరిగిన సిరీస్‌లో 4-1 తేడాతో ఓడించింది. దీని తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనతో టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ప్రస్తుతం సూర్య నాయకుడిగా సక్సెస్ అయినప్పటికీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏ మేరకు నిలబెట్టుకుంటాడో ఆరు నెలల్లో తేలిపోనుంది.
రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేయడం సూర్యకి ఉన్న రెండో సవాలు. రోహిత్ శర్మ కెప్టెన్‌గా చాకచక్యంతో పాటు డ్రెస్సింగ్ రూమ్‌లోని వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచడంలో సక్సెస్ ఫుల్ గా వ్యవహరించాడు. ప్రస్తుతం జట్టులో నాయకత్వం కోసం ఉవ్విళ్లూరుతున్న ఆటగాళ్ల మధ్య.. వారిని సమన్వయ పరుస్తూ సూర్య జట్టును ఎలా నడిపిస్తాడన్నది పెద్ద ప్రశ్న.
మూడో ఛాలెంజ్ ఏంటంటే... మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ గా జట్టును విజయపథంలో నడిపించే ముఖ్యమైన పనితో పాటు కెప్టెన్ గా సూర్య జట్టును ముందుకు తీసుకెళ్లాలి. క్రీడాకారులందరి ఆటతీరును మెరుగుపరచుకోవడంతోపాటు తన ఆటతీరును మెరుగు పరచాల్సిన బృహత్తర బాధ్యత సూర్యకుమార్‌పై ఉంది.
Also Read: ఇవేం చెత్త ప్రశ్నలు.. పాక్ జర్నలిస్టుపై హర్భజన్ ఫైర్!
కెప్టెన్‌గా ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో సూర్య బ్యాట్స్‌మెన్‌గా బాగానే రాణించాడు. ఈ 7 మ్యాచ్‌ల్లో సూర్య ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలతో 42.85 సగటుతో మొత్తం 300 పరుగులు చేశాడు. పూర్తి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన యాదవ్ ఇప్పుడు తన ఫామ్‌ను ఎలా కొనసాగిస్తాడో చూడాలి.
ఇన్ని సవాళ్ల మధ్య సూర్య తన కెప్టెన్సీలో జట్టును విజయపథంలో నడిపించడంలో విఫలమైతే, అతడిని ఎప్పుడైనా కెప్టెన్సీ నుంచి తప్పించవచ్చని బీసీసీఐ పేర్కొంది. కనుక జట్టును విజయపథంలో నడిపించడంలో సూర్య సఫలమైతే, 2026లో జరిగే తదుపరి టీ20 ప్రపంచకప్ వరకు కెప్టెన్‌గా కొనసాగుతాడు. లేదంటే సూర్య తన నాయకత్వాన్ని మరొకరికి వదులుకోవాల్సి వస్తుంది.