Meditation Benefits: ధ్యానం వల్ల ఇన్ని లాభాలున్నాయా..? ప్రతిరోజు ధ్యానం చేస్తే అద్భుత ఫలితాలు

ప్రస్తుత కాలంలో అనేక కారణాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ ధ్యానం, యోగా క్రమం తప్పకుండా చేయాలి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం బాగా పని చేస్తుంది. ప్రతి రోజూ కొద్దిసేపు ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గుతుంది.

Meditation Benefits: ధ్యానం వల్ల ఇన్ని లాభాలున్నాయా..? ప్రతిరోజు ధ్యానం చేస్తే అద్భుత ఫలితాలు
New Update

Meditation Benefits: ప్రస్తుత కాలంలో ఒత్తిడి అనేది సర్వసాధారణం అయ్యింది. మారుతున్న జీవనశైలిలో మార్పులు, ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆహారం, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఆందోళన రకరకాల కారణాలవల్ల ప్రస్తుత కాలంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అయితే.. ఒత్తిడి తగ్గించుకోవడానికి, మనసు ప్రశాంతంగా ఉండాలంటే దీనికోసం యోగ ధ్యానం, వాకింగ్‌ వంటివి చేస్తే ఒత్తిడిని అదుపు చేయవచ్చు. ఈ ఒత్తిడిని ఎలా అదుపులో ఉంచుకోవాలో కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఒత్తిడి తగ్గాలంటే...

  • ఎక్కువగా ఒత్తిడి ఉంటే ఒక పది నిమిషాలు ధ్యానం చేస్తే దీని నుంచి ఉపశమనం పొందవచ్చు. ధ్యానం చేస్తే మెదడుకు రిలాక్సేషన్ వస్తుంది. అందుకే పూర్వికులు ధ్యానాన్ని ప్రతీ రోజూ చేసేవారు.
  • ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో ధ్యాన​ం చేయలేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. హార్ట్ రేట్, గ్లూకోజ్ లెవెల్స్, బీపీ, కార్టిసాల్ లెవెల్స్ తగ్గాలంటే ధ్యానం బెస్ట్.
  • శ్వాస వ్యాయమాలు చేస్తే ఒత్తిడి తగ్గి, హార్ట్‌రేట్‌ నార్మల్‌గా ఉంటుంది. బీపీ, హార్ట్ రేట్, గ్లూకోజ్ లెవెల్స్, కార్టిసాల్ లెవెల్స్ తగ్గాలంటే ధ్యానం ఉత్తమం. ఉచ్వాస, నిశ్వాసాలపై మనుసును ఏకాగ్రం చేస్తూ కొద్దిసేపు ధ్యానం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
  • ఒత్తిడికి గురైయితే కార్టిసోల్‌, డొపమైన్ వంటి హార్మోన్‌లు పెరుగుతాయి. తీవ్ర ఒత్తిడికి లోనైనప్పుడు షుగర్ లెవల్స్ పడిపోవడం, హైపర్‌టెన్షన్‌ వంటి సమస్యలు వస్తాయి.
  • ఒత్తిడి, అధిక రక్తపోటు వంటి సమస్యలకు ధ్యానం ఉత్తమ మార్గమని డాక్టర్లు అంటున్నారు. శ్వాస వ్యాయామాలు చేస్తే మనల్ని మనం ప్రశాంతంగా ఉంచుకోవచ్చు.

త్వరగా రిలీఫ్‌ కావాలంటే..

  • ఈ ధ్యానం చేయాలంటే ముందుగా ప్రశాంతమైన, సౌకర్యవంతమైన స్థలంలో కూర్చోవాలి. ధ్యానం ప్రారంభంలో ఛాతీ నుంచి పొత్తికడుపు వరకు వీలైనంత లోతుగా గాలి పీల్చుకొని నెమ్మదిగా వదలాలి. ఈ విధంగా వీలైనన్ని సార్లు 20 నిమిషాల వరకు రిపీట్‌ చేయాలి.
  • ఈ విధంగా గట్టిగా శ్వాస పీల్చడం, కొన్ని సెకెండ్ల పాటు నిలిపి ఉంచడం, వదిలేయడం అనేది ఇన్‌స్టంట్‌ రిలీఫ్‌ని వస్తుంది. మనస్సును ఒక చోట కేంద్రీకరించడానికి మెదడుకు శిక్షణ ఇవ్వగలగడమే మెడిటేషన్ అంటారు. ఫస్ట్‌లో అంత ఏకాగ్రత కుదరకపోయినా చేసే కొద్దీ డైవర్షన్స్ తొలగిపోతుంది.
  • ప్రతిరోజూ 15 నిమిషాల పాటు ధ్యానం చేస్తే కోపం తగ్గుతుంది. ధ్యానం చేస్తే మనసుని ప్రశాంతంగా, ఆలోచనలు అదుపులో ఉంటాయి.
    ధ్యానం చేయడం వల్ల ఇలాంటి ఒత్తిడి, టెన్షన్ నుంచి బయటపడొచ్చు. మెదడు మెరుగు పడి, బీపిని కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది.

ఇది కూడా చదవండి: ఇలా చేస్తే క్యారెట్లు వాడిపోకుండా ఫ్రెష్‌గా ఉంటాయి

#health-benefits #meditation-benefits #reduces-stress
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe