PM Modi In Lakshadweep: భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం లక్షద్వీప్ (Lakshadweep) పర్యటనలో ఉన్నారు. ఈ విషయం గురించి, అక్కడి అనుభవాలను గురించి ప్రధాని సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను పంచుకోవడంతో పాటు అక్కడి విశేషాలను కూడా వివరించారు. ముందుగా లక్షద్వీప్ ప్రజలు ఇచ్చిన ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపారు.
కొద్ది రోజుల క్రితమే నాకు లక్షద్వీప్ ప్రజల మధ్య జీవించే అవకాశం లభించింది. ఈ ద్వీపాల అద్భుతమైన అందం, ఇక్కడి ప్రజల ప్రేమ చూస్తుంటే నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నాను అంటూ రాసుకోచ్చారు. అగట్టి, బంగారం, కవరత్తి ప్రజలతో పాటు వారి జీవనవిధానంలో కూడా నేను ఎంతో మునిగిపోయాను.
Morning Walk: అంతేకాకుండా ద్వీపంలో మోదీ ఉదయాన్నే బీచ్ ఒడ్డున వాకింగ్ చేస్తున్న చిత్రాలతో పాటు సముద్రంలో స్నార్కెలింగ్ కూడా చేశారు. వాటికి సంబంధించిన కొన్ని చిత్రాలను కూడా ప్రధాని సోషల్ మీడియాలో పంచుకున్నారు. కేవలం లక్షద్వీప్ ప్రకృతి అందాలే కాకుండా..అక్కడి ప్రశాంతత కూడా నన్ను కట్టిపడేసిందని మోదీ చెప్పారు.
ఆలోచించే అవకాశం కల్పించింది ఈ ద్వీపం: మోదీ
ఈ ద్వీపంలో ఉన్న అందం , శాంతి 140 కోట్ల మంది భారతీయుల కోసం ఎలా కష్టపడి పని చేయాలో ఆలోచించే అవకాశాన్ని కూడా నాకు కల్పించిందని మోదీ తెలియజేశారు. ఈ సందర్భంగా మోదీ (Modi) బీచ్ ఒడ్డున వాకింగ్ చేయడంతో పాటు స్నార్కెలింగ్ చేయడం గురించి కూడా తెలియజేశారు. రెండు కూడా గొప్ప అవకాశాలని వాటిని నేను ఇన్నాళ్లకు సద్వినియోగం చేసుకున్నానని వివరించారు.
Snorkeling: ఇక్కడి సహజమైన బీచ్ ల వెంట నడుస్తూ స్వచ్ఛమైన వాతావరణాన్ని గాలిని పిలుస్తూ ప్రతి క్షణం కూడా ఆనందాన్ని పొందినట్లు తెలిపారు. అంతేకాకుండా అక్కడి వ్యాపార సంబంధ విషయాలను కూడా ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. అక్కడ వ్యక్తిగత వినియోగం మార్కెట్ అమ్మకం రెండింటికీ సేంద్రీయ కూరగాయల సాగు గురించి కూడా ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు.
అక్కడ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అందుకుంటున్న లబ్ధిదారులను కలిసి కాసేపు ముచ్చటించినట్లు ఆయన వివరించారు. ఇక్కడి ప్రజల మెరుగైన ఆరోగ్య సంరక్షణ, వేగవంతమైన ఇంటర్నెట్ , తాగు నీరు కోసం అవకాశాలను సృష్టించడంతో పాటు అధునాతన పద్దతుల ద్వారా అభివృద్ధితో అక్కడి ప్రజల జీవితాలను ఉద్దరించడమే లక్షద్వీప్ లోని కేంద్ర ప్రభుత్వ దృష్టి అని మోదీ చెప్పుకొచ్చారు.
లక్షద్వీప్‌లోని శక్తివంతమైన స్థానిక సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు.లక్షద్వీప్ కేవలం ద్వీపాల సమూహం మాత్రమే కాదని, ఇది సంప్రదాయాలకు అనాదిగా వస్తున్న వారసత్వ సంపద అని, ఇక్కడి ప్రజల స్ఫూర్తికి నిదర్శనమని ప్రధాని మోదీ అన్నారు.
Also read: ఆ ఐటీ కంపెనీ ఉద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్ లు.. ఏకంగా కార్లు, కంపెనీలో షేర్లు!