Snakes : విమాన ప్రయాణికుడి ప్యాంట్ జేబులో పాములు.. ఖంగుతిన్న అధికారులు!

ఓ విమాన ప్రయాణికుడు రహస్యంగా పాములను తరలిస్తున్న సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. కళ్లద్దాలు దాచుకునే చిన్నపాటి బ్యాగులో రెండు పాములను బంధించి, జేబులో పెట్టుకోగా మయామీ విమానాశ్రయ భద్రతా సిబ్బంది పట్టుకుంది. ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Snakes : విమాన ప్రయాణికుడి ప్యాంట్ జేబులో పాములు.. ఖంగుతిన్న అధికారులు!
New Update

America : ఓ విమాన ప్రయాణికుడు(Air Passenger) రహస్యంగా పాములను(Snakes) తరలిస్తున్న సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. గత నెల 26న ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా అతని ఫ్యాంటులో ఉన్న ఓ చిన్నపాటి సంచిలో పాములను గుర్తించినట్లు అమెరికాలోని మయామీ విమానాశ్రయ భద్రతా సిబ్బంది వెల్లడించింది. ఈ మేరకు ట్రాన్స్‌పోర్ట్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌(TSA) ట్విటర్‌లో పోస్ట్ చేసింది. కళ్లద్దాలు దాచుకునే బ్యాగులో ఉన్న పాములను స్వాధీనం చేసుకుని వాటిని ఫ్లోరిడా మత్స్య, వన్యప్రాణి సంరక్షణ కమిషన్‌కు అప్పగించినట్లు తెలిపారు.

Also Read : వాట్సాప్​ డేటా భద్రంగా ఉండాలా?.. ఈ ఐదు ఆప్షన్లు వాడండి..

#snakes #miami-international-airport #air-passenger
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe