Smoking: ధూమపానం ఆరోగ్యానికి హానికరం.. ఇది ఊపిరితిత్తులతో పాటు మెదడు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం ధూమపానం చేసేవారికి త్వరగా జ్ఞాపకశక్తి కోల్పోవడం, అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తేలింది. అంతేకాకుండా ధూమపానం చేసేవారి మెదడు కుంచించుకుపోతుందని చెబుతున్నారు. పొగతాగడం వల్ల గుండె, ఊపిరితిత్తులపై ప్రభావం పడడమే కాకుండా మెదడుపై కూడా శాశ్వత ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
మెదడు ముడుచుకుపోతుంది:
- వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుల పరిశోధన ప్రకారం ధూమపానం చేసేవారి జ్ఞాపకశక్తి త్వరగా పోతుందని, అల్జీమర్స్ వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. అంతేకాకుండా ధూమపానం చేసేవారి మెదడు కుంచించుకుపోతుందని, అసలు ఆకృతికి తిరిగి రాదని అంటున్నారు. సిగరెట్ తాగడం మానేయడం వల్ల మెదడు కణజాలం మరింత దెబ్బతినకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు. సాధారణంగా మనిషి మెదడు వయసుతో పాటు దాని పరిణామం తగ్గుతూ ఉంటుంది. కానీ ధూమపానం చేసేవారి మెదడు మరింత తగ్గిపోతుందని, వృద్ధుల్లా మారిపోతారని శాస్త్రవేత్తలు అంటున్నారు.
32,094 మందిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు:
- ఈ పరిశోధనలో వివిధ వయసుల 32,094 మంది మెదడులను అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో ఒక వ్యక్తి ఎంత ఎక్కువ ధూమపానం చేస్తే అతని మెదడు పరిమాణం అంత చిన్నదిగా ఉంటుందని నిర్థారించారు. అంతేకాకుండా ఈ-సిగరెట్‌ల దీర్ఘకాలిక వినియోగం కూడా మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు.
ఈ-సిగరెట్ వల్ల శ్వాస సమస్యలు:
- ఇటీవల యువతలో ఈ-సిగరెట్ల వినియోగం బాగా పెరిగింది. ఈ-సిగరెట్ల వినియోగం రోజురోజుకూ పెరుగుతుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటిలో 900 నుంచి 2000 రసాయనాలు ఉంటాయని, ఇవి ఊపిరితిత్తుల్లోకి లోతుగా చేరి శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: గర్భిణీలు ఆఫీసుకు వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: షుగర్‌ను కంట్రోల్ చేసే సూపర్ డ్రింక్స్..ఇంట్లోనే సులభంగా తయారీ