Urinary system: మీ మూత్రం దుర్వాసన వస్తుందా?..అయితే ఇదే కారణం

మూత్రంలో దుర్వాసన వస్తే తీవ్రమైన వ్యాధులకు సంకేతమని నిపుణులు చెబుతున్నారు. మూత్ర విసర్జనలో మంటగా ఉంటే మధుమేహం, క్లామిడియా-గోనేరియా, కిడ్నీ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

Urinary system: మీ మూత్రం దుర్వాసన వస్తుందా?..అయితే ఇదే కారణం
New Update

మూత్రం మన శరీర పరిస్థితుల గురించి స్పష్టమైన సంకేతాలను ఇస్తుంది. సాధారణం కంటే ఎక్కువ లేదా తక్కువ మూత్రం వస్తున్నట్లయితే, దానిలో ఏవైనా మార్పులు లేదా దుర్వాసన ఉంటే అప్పుడు ఏదో తప్పు జరుగుతోందని అర్థం చేసుకోవచ్చని వైద్యులు అంటున్నారు. మూత్రం రంగు, వాసన మన ఆరోగ్యాన్ని తెలియజేస్తాయి. మూత్రం దుర్వాసన వస్తుంటే చాలా మంది దాన్ని పెద్దగా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇది తీవ్రమైన వ్యాధులకు సంకేతం అవుతుందని నిపుణులు అంటున్నారు.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్:
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది పురుషులు, మహిళలు ఇద్దరినీ ప్రభావితం చేసే ఒక సాధారణ సమస్య. మూత్రంతో బాక్టీరియా శరీరంలోని మిగిలిన భాగాలకు వ్యాపించినప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. మూత్రవిసర్జన సమయంలో మంట, నొప్పి కూడా వస్తుంటుంది. విపరీతమైన దురద, మూత్ర విసర్జనకు ఇబ్బంది, దుర్వాసన, అలసట, మూత్రం సరిగ్గా పోకపోవడం ఇవన్నీ ఇన్ఫెక్షన్ లక్షణాలు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

మధుమేహం:
బ్లడ్ షుగర్ లెవెల్స్ మరీ ఎక్కువైతే కూడా మూత్రం దుర్వాసన వస్తుంది. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు లేదా సరిగ్గా పనిచేయకపోతే చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది రక్తం, మూత్రం యొక్క pH స్థాయిని క్షీణింపజేస్తుంది. ఫలితంగా మూత్రం వాసన మరింత పెరుగుతుంది.

క్లామిడియా-గోనేరియా:
క్లామిడియా, గోనేరియా అనేవి లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు, ఇవి మూత్ర నాళాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ ఇన్ఫెక్షన్‌లతో బాధపడేవారి మూత్రం కూడా దుర్వాసన వస్తుంటుంది. ఈ అంటువ్యాధులు మూత్రనాళం, జననేంద్రియాలలో వాపును కలిగిస్తాయి, మూత్రం ప్రవాహాన్ని కూడా అడ్డుకుంటాయి. ఫలితంగా బ్యాక్టీరియా, వైరస్‌లు మూత్రంలోకి ప్రవేశిస్తాయి. దాంతో చెడు వాసన కలిగిస్తుంది.

కిడ్నీ సమస్యలు:
కిడ్నీలు సరిగా పనిచేయనప్పుడు కూడా మూత్రం దుర్వాసన వస్తుంది. దీన్ని కిడ్నీ డిస్‌ఫంక్షన్ అని కూడా అంటారు. మూత్రం అమ్మోనియా వాసన వస్తుంది. కొన్నిసార్లు రకరకాల వాసనలు వస్తుంటాయి.

ఇది కూడా చదవండి: స్మార్ట్‌ వాచ్‌తో మన శరీరంలోకి వైరస్‌లు..జాగ్రత్త

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-tips #foamy-urine-issues #urinary-system
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe