/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/vijay-2-jpg.webp)
Slipper Thrown at Tamil Hero Vijay: తమిళ సినియర్ యాక్టర్, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్ (Vijayakanth) నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు నివాళి అర్పించడానికి అటు రాజకీయ నేతలతో పాటు సిని యాక్టర్లు సైతం తరలివచ్చారు. తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) తోపాటు కమల్ హాసన్, విజయ్ ఆంటోని, ఇతర హీరోలు, డైరెక్టర్లు, నటీనటులు ఇలా సెటబ్రెటిలంతా విజయ్ కాంత్ కు నివాళులర్పించారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కూడా కెప్టెన్ కు నివాళి అర్పించడానికి వెళ్లారు.
Also read: టెలిగ్రామ్ లో సినిమా చూస్తున్నారా? బీ కేర్ ఫుల్.!
డీఎండీకే ప్రధాన కార్యాలయంలో విజయకాంత్ పార్థివదేహానికి నివాళి అర్పించారు. అనంతరం విజయకాంత్ భార్య ప్రేమలతతో మాట్లాడి ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పి అక్కడ నుంచి తిరిగి వెళ్లిపోయే టైంలో అవమానం జరిగింది. విజయ్ దళపతి బయటకు వచ్చిన సమయంలో అక్కడ ఫుల్ రష్ గా ఉండడంతో తోపులాట జరిగింది. అక్కడ ఉన్న వారిని పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. హీరో విజయ్ (Hero Vijay) ను అక్కడ ఉన్న జనాలు చుట్టుముట్టేశారు. దీంతో, ఆ గుంపులో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి ఒకరు దళపతిపైకి చెప్పు విసిరాడు. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
I was hoping that it was an edited video. No, unfortunately, it's not.
Third video angle of slipper thrown at Vijay.
Heinous 😟🙁pic.twitter.com/lRDifxtzVy https://t.co/hJxpcYxgp3
— WarLord (@Mr_Ashthetics) December 29, 2023
ఈ వీడియో చూసిన దళపతి అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, దళపతి విజయ్ ఫ్యాన్స్ కు.. మరో స్టార్ హీరో అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు ఉన్నాయని.. విజయ్ అంటే పడని సదరు హీరో అభిమానే ఇలా చేసి ఉంటారని పలువురు భావిస్తున్నారు.