Socks: సాక్సులు వేసుకుని పడుకుంటున్నారా?.. ఈ సమస్యలు తప్పవు పడుకునేప్పుడు లేదా ఎక్కువ సమయం సాక్సులు ధరించడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు బిగుతుగా ఉండే సాక్స్ ధరించడం వల్ల కాళ్ల సిరలపై ఒత్తిడి పడుతుంది. రాత్రిపూట సాక్స్‌తో నిద్రించడం వల్ల రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతోంది. By Vijaya Nimma 07 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Socks: శీతాకాలంలో చలి నుంచి శరీరాన్ని రక్షించడానికి శాలువాలు లేదా స్వెటర్లు వంటి వెచ్చని బట్టలు ధరిస్తారు. వెచ్చని దుస్తులతో పాటు చేతి తొడుగులు, సాక్స్ కూడా ధరిస్తారు. కొందరు నిద్రపోయేటప్పుడు సాక్స్‌లు వేసుకుని పడుకుంటారు. ఇలా చేయడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు అంటున్నారు. రక్త ప్రసరణపై ప్రభావం: రాత్రిపూట సాక్స్‌తో నిద్రించడం వల్ల రక్త ప్రసరణపై ప్రభావం పడుతుంది. మన శరీరంలో రక్తప్రసరణలో సమస్య ఏర్పడినప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. అధిక వేడి: నిద్రపోయేటప్పుడు సాక్స్‌లు ధరించడం వల్ల పాదాల ద్వారా గాలి వెళ్లకుండా చేస్తుంది. దీని వల్ల శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరుగుతుంది. చర్మ అలెర్జీలు: పడుకునేప్పుడు లేదా ఎక్కువ సమయం సాక్సులు ధరించడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే సాక్సుల్లో ఉండే బ్యాక్టీరియా కారణంగా అలెర్జీలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. గుండె జబ్బులు: రాత్రిపూట సాక్స్ వేసుకుని పడుకోవడం గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు బిగుతుగా ఉండే సాక్స్ ధరించడం వల్ల కాళ్ల సిరలపై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల గుండె రక్తాన్ని పంప్ చేయడానికి కష్టపడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుందని వైద్యులు అంటున్నారు. ఈ విషయాలను గుర్తుంచుకోండి: 1. రాత్రిపూట వదులుగా ఉండే సాక్స్‌లు వేసుకోవాలి 2. ఎల్లప్పుడూ శుభ్రంగా ఉన్న సాక్సులు ధరించాలి 3. సాక్స్ ధరించే ముందు పాదాలకు మసాజ్ చేయాలి 4. నైలాన్ సాక్స్ ఇబ్బందిగా ఉంటే కాటన్ సాక్స్ ధరించాలి ఇది కూడా చదవండి: సాక్సులు వేసుకుని పడుకుంటున్నారా?.. ఈ సమస్యలు తప్పవు గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #sleeping #health-problems #best-health-tips #socks మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి